ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి బాగా స్మార్ట్ ఫోన్ పిచ్చి పడింది.ముఖ్యంగా ఫోటోలు పిచ్చి మాత్రం మరీ ఎక్కువగా ఉంది.
ఎక్కడపడితే అక్కడ ఫోటోలు దిగడం, రీల్స్ చేయడం బాగా సరదా అయిపోయింది.మామూలుగా ఏదైనా స్పెషల్ లాంటివి ఉంటే సెల్ఫీ దిగటంలో అర్థం ఉంటుంది.
అలా కాకుండా అదే పనిగా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సెల్ఫీలు తీసుకుంటే అది పిచ్చి అని అంటారు.
అంతేకాకుండా ఈమధ్య ఆరోగ్యం బాలేకున్న ఆ పరిస్థితుల్లో కూడా సెల్ఫీలు దిగి పంపిస్తున్నారు.
మామూలుగా ఆరోగ్యం బాగోకపోతే విశ్రాంతి తీసుకుంటారు.కానీ సెల్ఫీలు తీసుకొని షేర్ చేస్తే మాత్రం వెంటనే ట్రోల్స్ కు అవుతారు.
వాళ్ళు సామాన్యులైన కానీ సెలబ్రెటీలైనా కానీ.ఇప్పుడు అటువంటి పరిస్థితినే ఎదుర్కొంది మరో సెలబ్రిటీ.
ఇంతకు ఆమె ఎవరో కాదు నటి హరితేజ. ఇంతకూ అసలేం జరిగిందో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలిసారిగా యాంకర్ గా పరిచయమైన హరితేజ గురించి అందరికీ తెలిసిందే.మొదట్లో యాంకర్ గా అడుగుపెట్టి తన మాటలతో అందరి దృష్టిలో పడింది.తర్వాత వెండితెరపై సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.అంతేకాకుండా బుల్లితెరపై కూడా సీరియల్స్ లో నటించింది.
ఇక ఈమె డాన్స్ కూడా బాగా చేస్తూ ఉంటుంది.
మొదట వెండితెరకు ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో పరిచయం అయ్యింది.అలా ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది ఇక మనసు మమత సీరియల్ తో బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
ఇక ఈ క్రమంలో ఆమెకు 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.
ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే 2015 లో దీపక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.వీరికి ఒక కూతురు కూడా ఉంది.
ఇక హరితేజ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.అప్పుడప్పుడు ఈమె తన వ్యక్తిగత విషయాలలో బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.
ఇక సోషల్ మీడియాలో తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.
ఇక తన భర్త తో చేసే రీల్స్ కూడా షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
అయితే అప్పుడప్పుడు ఈమె షేర్ చేసుకునే పోస్టులని చూస్తే నెటిజన్స్ బాగా మండిపడతారు.ముఖ్యంగా ఈమె వేషధారణను చూసి నెగిటివ్ కామెంట్లు చేస్తారు.
ఈ వయసులో కూడా ఆమె గ్లామర్ షో చేయటంతో అందరూ తనపై బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా లో తన సెల్ఫీ ఫోటో దిగి షేర్ చేసుకోగా అందులో తను తన చేతికి సెలైన్ ఎక్కించుకున్నట్లు కనిపించింది.
అంటే తను అనారోగ్యంతో ఉన్నట్లు అర్థమవుతుంది.దీంతో ఆమె అలా అనారోగ్యంతో ఉండి కూడా ఫోటో పంచుకోవడంతో ఈ పరిస్థితిలో కూడా ఇటువంటి సెల్ఫీలు షేర్ చేయటం అవసరమా అంటూ తనపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.