ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి.అలాంటి సినిమాలలో మసూద ఒకటి.
తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.కేవలం తమిళంలో మాత్రమే కాకుండా, తెలుగులో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సాయికిరణ్ దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హార్రర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ విధంగా ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా నవంబర్ 18 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక థియేటర్లలో ఊహించని విధంగా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.థియేటర్లలో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా థియేటర్ రన్ పూర్తిచేసుకుని ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సమస్త ఆహా భారీ ధరలకు కైవసం చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని త్వరలోనే ఆహాలో ప్రసారం చేయనున్నట్టు సమాచారం.
తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఈనెల 16న లేదా 23వ తేదీ నుంచి ఆహాలో ప్రసారం చేయనున్నట్టు తెలుస్తుంది.త్వరలోనే ఈ విషయం గురించి ఆహా అధికారకంగా ప్రకటించనున్నారు.ఈ సినిమాలో సీనియర్ నటి సంగీత, తిరువీర్, కావ్య, కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు.థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఆహాలో ప్రసారమవుతూ ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.