ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.56
సూర్యాస్తమయం: సాయంత్రం.6.35
రాహుకాలం:మ.3.00 మ4.30
అమృత ఘడియలు: సా.5.30 ల6.00
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36
మేషం:

ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
వృషభం:

ఈరోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు.
మిథునం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.నూతన రుణయత్నాలు చేస్తారు.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.దూరపు బంధువులను కలుసుకుంటారు.వృత్తి వ్యాపారం అధికమౌతాయి.వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కర్కాటకం:

ఈరోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
సింహం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు .కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.
నూతన వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
కన్య:

ఈరోజు నిరుద్యోగులకు నిరాశ తప్పదు.చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు.బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు.ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
తుల:

ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది.ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.
వృశ్చికం:

ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
ధనుస్సు:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహన యోగం ఉన్నది.వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
మకరం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది.బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.
కుంభం:

ఈరోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వృత్తి, వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి.ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది.
మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని కొత్త పరిచయాలు పెంచుకుంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.