ఏడాదికి రెండు సార్లు కళ్యాణం జరిగే రామాలయం ఎక్కడ ఉందో తెలుసా?

సాధారణంగా మనకు శ్రీ రామ కళ్యాణం ఏడాదికి ఒకసారి శ్రీ రామ నవమి రోజు అభిజిత్ లగ్నం అందు దేశంలోని వివిధ రామాలయాలలో కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.కానీ మీరు ఎప్పుడైనా ఏడాదికి రెండుసార్లు కళ్యాణం జరిగే రామాలయం గురించి విన్నారా విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలో రామతీర్థం గ్రామంలోని వెలసిన రామాలయంలో మాత్రం శ్రీరామచంద్రుడికి ఏటా రెండుసార్లు కళ్యాణం జరిపిస్తారు.

 Unknown Facts About Ramatheertham Ramatheertham, Rama, Two Times Marrige, Vijaya-TeluguStop.com

ఈ విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే రెండు సార్లు ఎందుకు కల్యాణం జరిపిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం ప్రస్తుతం రామాలయం ఉన్న ప్రాంతం మొత్తం అటవీ ప్రాంతంగా ఉండేది.

ఈ ప్రాంతానికి కుంబిళాపురం గ్రామానికి చెందిన ఓ మూగ వృద్ధురాలు కట్టెల కోసం వచ్చింది.అప్పుడు అక్కడ శ్రీరామచంద్రుడి ప్రత్యక్షమై ఆమె నాలుకపై శ్రీరామ అని రాశాడట ఈ విషయాన్ని వెంటనే ఆ వృద్ధురాలు కుంబిళాపురం పరిపాలిస్తున్న రాజుకు విషయం తెలిపింది.

ఈ క్రమంలోని శ్రీరామచంద్రుడు రాజు కలలో కనిపించి అక్కడ విగ్రహాలు ఉన్నాయని వాటిని వెలికి తీసి ఆలయం నిర్మించాలని చెప్పాడు.మరుసటి రోజు ఉదయం రాజు ఈ ప్రాంతంలో సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను ఒక నీటి మడుగులో నుంచి వెలికి తీశారు.

ఈ విధంగా తీర్థం నుంచి విగ్రహాలు బయట పడటం వల్ల ఈ ఆలయానికి రామతీర్థం అనే పేరు పెట్టారు.

Telugu Rama, Ramatheertham, Times Marrige, Vijayanagaram-Telugu Bhakthi

ఈ విధంగా సీతారాముల విగ్రహాలను మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు రామతీర్థంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ఏటా భీష్మ ఏకాదశి రోజు సీతారాముల వారికి ఎంతో అంగ రంగ వైభవంగా తిరు కళ్యాణ మహోత్స వాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ కళ్యాణాన్ని తిరు కళ్యాణ మహోత్సవ మని, దేవుని పెళ్లి అని పిలుస్తారు.ఈ క్రమంలోనే చైత్రమాసం అభిజిత్ లగ్నంలో ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు జరిగే సమయంలో ఈ రామతీర్థంలో కూడా స్వామివారికి కళ్యాణమహోత్సవం జరుపుతారు.

శ్రీరామనవమి రోజు జరిగే కళ్యాణం పగటి పూట జరిగితే భీష్మ ఏకాదశి రోజు జరిగే కల్యాణం మాత్రం సాయంత్రం జరుగుతుంది.అదే విధంగా భీష్మ ఏకాదశి రోజు దేవుని పెళ్లి జరిగిన తరువాతే ఈ ప్రాంతంలో సాధారణ వివాహాలకు ముహూర్తం పెట్టుకోవడం ఆచారం వస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube