ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గేకు కొత్త సవాల్ ఎదురైంది.గత ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు.
వరుస పరాజయాలతో ఒక్కో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పొగొట్టుకుంటూ వస్తోంది.పార్టీ అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వేరే పార్టీలోకి చేరడం, పార్టీ పదవి బాధ్యతలకు రాజీనామా చేయడం జరుగుతోంది.
దీంతో మల్లికార్జున ఖర్గేకు పెను సవాల్‌గా మారింది.ప్రస్తుతం కాంగ్రెస్ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.
కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతూ వస్తుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ-సోనియా గాంధీ నాయకత్వాన్నే ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల రూపంలో ఖర్గేకు పెనుసవాల్‌గా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓట్లను చీల్చి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్లాన్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఐక్యమత్యం చేయడానికి ప్లాన్ చేస్తోంది.ఖర్గే తన సొంత రాష్ట్రం కర్ణాటకతోపాటు రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ క్రమంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ప్రభావం చూపనుంది.

దీంతో ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కచ్ఛితంగా గట్టిపోటీ ఇవ్వాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.1998లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.అప్పుడు పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉండో.
ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది.గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక పార్టీలుగా చీలిపోయింది.వామపక్షాలు, ఇతర పార్టీలతో 2004లో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.2009లోనూ ఇదే ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేసింది.అయితే 2014లో నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.దేశవ్యాప్తంగా బీజేపీ బలపడటంతో కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతూ వస్తోంది.దీంతో ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే పార్టీ విజయాలు అందుకోవాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు.