టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఢిల్లీలోనూ దర్యాప్తు కొనసాగనుంది.ఈ విషయంపై ఢిల్లీ తెలంగాణ భవన్ లోని ఇంటెలిజెన్స్ పోలీసులు రంగంలోకి దిగనున్నారు.
ఫరీదాబాద్ కు చెందిన సతీశ్ శర్మ గురించి ఆరా తీయనున్నారు.సతీశ్ శర్మ నివాసం, పరిచయాలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎమ్మెల్యేల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 8 తో పాటు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 120బి కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో నిందితులపై కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.







