ఈ డ్రైవ‌ర్ నిజంగా గొప్ప మ‌న‌సున్నోడు.. ఏం చేశాడో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

స‌రైన స‌మ‌యంలో సాహ‌సోపేత నిర్ణ‌యాలు తీసుకుంటే ఎంతోమందిని కాపాడ‌వ‌చ్చిని ఇప్ప‌టికే చాలామంది రియ‌ల్ హీరోలు నిరూపించారు.ప్ర‌మాదం ముంచుకొస్తున్న స‌మ‌యంలో త‌మ‌వంతుగా తీసుకునే కొన్ని నిర్ణయాలు, ప‌నుల వ‌ల్ల వంద‌లాది మంది ప్రాణాల‌ను ర‌క్షించ‌వ‌చ్చ‌ని ఇప్పుడు ఓ డ్రైవ‌ర్ కూడా నిరూపించాడు.

 This Driver Has A Really Great Mindset If You Know What He Did It Is Called Hats-TeluguStop.com

అయితే ఇందులో ఆయ‌న‌కు న‌ష్టం వాటిల్లినా స‌రే వంద‌లాది మంది ప్రాణాల‌ను నిల‌బెట్టాడు.దీంతో ఆ ట్యాక్సీ డ్రైవ‌ర్ సాహ‌సాన్ని, త్యాగాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు నెటిజ‌న్లు.

మ‌రి ఇంత‌కీ ఆయ‌న ఏం చేశాడో తెలుసుకుందాం.లండన్ దేశంలోని లివర్‌పూర్‌లో రీసెంట్ గా ఓ బాంబు పేలుడు సంభ‌వించింది.ఈ కారు డ్రైవ‌ర్ ఈ ప్రాంతంలో రిమెంబరెన్స్‌ డే సంద‌ర్భంగా అక్క‌డ క‌స్ట‌మ‌ర్ల కోసం వేచి చూస్తున్నాడు.అయితే రిమెంబ‌రెన్స్ డే సంద‌ర్భంగా ఒక వ్య‌క్తి మార‌ణ మోమం సృష్టించేందుకు త‌న‌ను తాను పేల్చుకోవాల‌ని అనుకున్నాడు.

ఇందులో భాగంగా క్యాబ్ డ్రైవ‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చి కారులో ఎక్కాడు.ఇక ఆ వ్య‌క్తి చెప్పిన ప్లేస్ కు తీసుకెళ్తుండ‌గా లివర్‌పూల్‌ మెటర్నటీ హాస్పిట‌ల్ వ‌ద్ద‌కు రాగానే డ్రైవ‌ర్ వెన‌కాల కూర్చున్న వ్య‌క్తి క‌ద‌లిక‌ల‌పై అనుమాన‌ప‌డ్డాడు.

Telugu Brave Taxi, Liverpool, London, Remembrance Day, Bomber, Taxi-Latest News

వెంట‌నే కారు దిగిపోయి బాంబర్‌ని క్యాబ్‌లోనే లాక్ చేసి దూరంగా జ‌రిగిపోయాడు.ఇంత‌లోనే ఆ కారులో కూర్చున్ వ్య‌క్తి తనను తాను పేల్చేసుకున్నాడు.ఈ దుర్ఘ‌ట‌న‌లో ఆ బాంబర్ చ‌నిపోగా డ్రైవ‌ర్ గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.అత‌న్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించ‌గా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.డ్రైవ‌ర్ సాహ‌సంతో వంద‌లాదిమంది ప్రాణాలకు ప్ర‌మాదం త‌ప్పింది.అయితే కారు మాత్రం పూర్తిగా కాలిపోయింది.

ఇక తన కారు పోయినా ప‌ర్వాలేద‌నుకుని ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ర‌క్షించిన అత‌న్ని స్థానికులు పొగుడుతున్నారు.ఇక డ్రైవ‌ర్ చూపించిన‌ సాహసానికి అంతా ఫిదా అయిపోతున్నారు.

అత‌న్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube