సాధారణంగా మనకి పులులు నారింజ, నలుపు చారలతో కనిపిస్తుంటాయి.పులి అనే పేరు వినగానే అలాంటి చారలు ఉన్న పులి చిత్రం మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.
కానీ మీరు ఎప్పుడైనా నల్లపులిని
చూశారా? పులి నలుపు రంగులో ఉండటం ఏమిటని ఆలోచిస్తున్నారా! అవును నలుపు రంగు చారలు ఉన్న పులి ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌లో ప్రత్యక్షమైంది…
నల్లని చారలు ఉన్న పులి ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌లో ఈ పులి సందడి చేసింది.ఈ పులి శరీరం మొత్తం నల్లని చారలతో ఉండి కేవలం అక్కడక్కడ మాత్రమే నారింజరంగు చారలను కలిగి ఉంది.
ఈ అరుదైన పులిని సౌమేన్ బాజ్‌పేయ్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు.అయితే ఈ పులి గురించి నిపుణులు మాట్లాడుతూ ఇలాంటి పులులను“మెలనిస్టిక్ టైగర్”అని పిలుస్తారని తెలియజేశారు.
ఇండియాలో ఎక్కువగా కనిపించే బెంగాల్ టైగర్ జాతికి చెందిన వాటిలో ఇవి కూడా ఒక భాగమని, కానీ వీటిలో జన్యులోపం కారణాలవల్ల శరీరం మొత్తం ఇలా నల్లని చారలు ఆక్రమించుకొని ఉన్నాయని నిపుణులు తెలియజేశారు.అయితే ప్రస్తుతం ఈ అరుదైన పులి చిత్రాలను ఈ క్రింది ఫేస్ బుక్ లో చూడవచ్చు.
ప్రస్తుతం ఈ పులి కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు తీసిన ఫోటో గ్రాఫర్ సౌమేన్ బాజ్‌పేయ్ మాట్లాడుతూ అడవిలో కొన్ని పక్షులు, కోతులు ఫోటో లను తీయడానికి వెళితే అక్కడ ఈ అరుదైన పులి తన కంట పడింది.
ఆ పులిని చూడగానే ఒక్కసారిగా నాకు నమ్మశక్యంగా లేదని, ఎందుకంటే పులులు గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో అలా చెట్టుచాటు నుంచి ఈ ఫోటోలు సేకరించానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశాడు.