జగన్ కు ఆ మొండి ధైర్యం ఎందుకో ? ఈ సమయంలోనూ ?

అసలు ఏంటి ఇన్నిన్ని పథకాలు, భారీగా నిధులు కేటాయింపులు, చేతికి ఎముకే లేనట్టుగా, రాష్ట్రానికి ఆర్ధికంగా భారమైన పథకాలకు జగన్ నిధులు కేటాయించడం చూస్తుంటే ఎవరికీ మింగుడుపడడంలేదు.

అసలు జగన్ ఈ సొమ్ములు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో ఎవరికీ అర్ధం కావడంలేదు.

అయినా జగన్ కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూనే ఉన్నారు.భారీగా సొమ్ములు కేటాయింపులు చేస్తున్నారు.

ఒక పక్క చూస్తే రాష్ట్రం ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటోంది.కోలుకోలేని విధంగా ఆర్ధిక కస్టాలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయి.

మరో వైపు కరోనా వైరస్ ప్రభావం ఏపీని అతలాకుతలం చేస్తోంది.అయినా జగన్ ఎక్కడా లెక్క చేయడం లేదు.

Advertisement

వచ్చే మార్గాలు అన్ని వైపులా మూసుకుపోయాయి.ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడంలేదు.

అయినా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తున్నాయి.జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు ఖజానాకు ఆర్ధిక భారమయ్యే పథకాలకు రూపకల్పన చేయడంతో పాటు ఎన్నో సంచలన నిర్ణయాలను జగన్ తీసుకున్నారు.

ఎన్నికల హామీలు ఏ ఒక్కటీ వదిలిపెట్టనని, అన్నిటినీ అమలు చేసి చూపిస్తాను అంటూ జగన్ చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు.ఇప్పటికే అమ్మ వడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్సమెంట్ ఇలా ఎన్నింటినో జగన్ అమలు చేసి చూపించారు.

వేలాది కోట్ల రూపాయల నిధులను దీనికోసం కేటాయించారు.ప్రస్తుతం కరోనా కష్టాలు ఏపీని చుట్టుముట్టాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ప్రజలు ఈ వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటూ అనేక కష్టాలను ఎదుర్కుంటున్నారు.అయినా జగన్ మాత్రం సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తూనే అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

Advertisement

ప్రస్తుత మత్సకారులకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి పదివేలను మత్యకార భరోసా కార్యక్రమం కింద ప్రారంభించారు.ఇది గతంలో ఇచ్చిన హామీనే.దీనిని సీఎం క్యాంపు కార్యాలయంలో‌ జగన్‌ ప్రారంభించారు .ముందుగా మత్స్యకారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా‌ జగన్‌ మాట్లాడి వారి కష్టాలు, నష్టాలు తెలుసుకున్నారు .వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు 10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామంటూ జగన్ చెప్పారు.చెప్పిన విధంగానే ప్రతి మత్యకారుడి ఖాతాలో 10 వేల రూపయల సొమ్ములు జమయ్యాయి.

దీని ద్వారా ఏపీలో మొత్తం 1,09,231 మంది లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది .దీని నిమిత్తం వంద కోట్ల రూపాయలను జగన్ కేటాయించారు.ఇంతవరకు బాగానే ఉన్నా, ఒకవైపు కరోనా కష్టాల్లో రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న సమయంలో జగన్ ఇలా చేయడంపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తాజా వార్తలు