వెండితెరపై మెరిసిన దిగ్గజ క్రికెటర్లు వీరే... ఆ స్టార్ క్రికెటర్ హీరోగా ఎంట్రీ..!

సినిమా తర్వాత భారతీయులు బాగా ఇష్టపడేది ఏదైనా ఉందా అని అడిగితే అది క్రికెట్ యే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.అయితే సినిమా, క్రికెట్ ఈ రెండింటిలోనూ మెరిసి అటు ప్రేక్షకులను ఇటు క్రీడా ప్రియులను అలరించిన క్రికెటర్లు కొందరున్నారు.

 Legendary Cricketers Shining On The Silver Screen Sports News, Fim Industry , Y-TeluguStop.com

వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా మాజీ దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఈ ఆటగాడు కేవలం క్రికెట్లోనే కాదు ఓ సినిమాలో కూడా నటించి మెప్పించాడు.అనుప‌మ్‌ ఖేర్, మందిరాబేడీ హీరో హీరోయిన్లుగా నటించిన మీరాబాయ్ నాటౌట్ అనే మూవీలో అనిల్ కుంబ్లే ఒక పాత్రలో నటించాడు.2008లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ హిట్ అయ్యింది.

మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ కూడా ఓ సినిమాలో నటించాడు.పంజాబీ సినిమాలో అతడు తన పదకొండేళ్ల వయసులో ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించాడు.ఇక అతని భార్య హాజల్ కీచ్ కూడా సినిమాల్లో నటించింది.

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బాడీగార్డ్ సినిమాలో ఆమె యాక్ట్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.

గ్రేటెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మ్యాన్ గా పేరు తెచ్చుకున్న సునీల్ గవాస్కర్ కూడా ‘సావాలి ప్రేమచి‘ అనే ఒక మరాఠీ లాంగ్వేజ్ సినిమాలో నటించాడు.అలాగే మలమాల్ అనే ఒక హిందీ సినిమాల్లో కూడా గెస్ట్ రోల్ లో నటించి మెప్పించాడు భాస్కర్! అలానే స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఫ్రెండ్ షిప్ అనే మూవీలో ఏకంగా హీరోగా నటించి ఆశ్చర్యపరిచాడు.ఇక త్వరలోనే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధ మయ్యాడు.

విక్రమ్ హీరోగా నటిస్తున్న కోబ్రా మూవీలో ఇంటర్‌పోల్ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్నాడు ఇర్ఫాన్!

.

Legendary Cricketers Shining On The Silver Screen Sports News

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube