సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్ అలాంటి ఫీల్డ్ లో హీరోగా హీరోయిన్ గా ఎదగడమే చాలా కష్టం ఒకసారి అలా ఎదిగారు అంటే ఆ స్టార్ డమ్ కంటిన్యూ చేయడం ఇంకా కష్టం.తెలుగులో స్టార్ హీరోలు గా హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిపోయి ఆ తర్వాత కనుమరుగైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి కోవకు చెందిన వారే హీరోయిన్ సదా.
చిత్రం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన తేజ ఆ సినిమా హిట్ అవడంతో తర్వాత నువ్వు నేను సినిమా చేశాడు ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మళ్లీ కొత్త వాళ్ళతో జయం అనే సినిమా చేశాడు ఈ సినిమాలో హీరోగా నితిన్ పరిచయం అవ్వగా సదా హీరోయిన్ గా పరిచయమైంది.
ఆ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో సదా స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఆ తర్వాత తెలుగులో ఆమెకు వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి.ఇండస్ట్రీలో తను స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని అందరూ అనుకున్నారు తమిళ్ లో విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా లో హీరోయిన్ గా నటించింది.
తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఆ సినిమా తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అయింది.ఆ తరువాత స్టార్ హీరోయిన్ అయిపోయింది అని ఆల్మోస్ట్ అందరూ అనుకునే సమయానికి ఒక డైరెక్టర్ తో లవ్ లో ఉందనే న్యూస్ బాగా చక్కర్లు కొట్టింది.
దాంతో ఆఫర్లు కొద్దిగా తగ్గాయి ఆ తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా లో ఒక క్యారెక్టర్ చేసింది.
ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ తనికి అడ్వాన్స్ ఇచ్చాడు ఆతర్వాత నెమ్మదిగా తన క్రేజ్ తగ్గిపోవడంతో ఆ ప్రొడ్యూసర్ తను ఇచ్చిన అడ్వాన్స్ లు వెనక్కి ఇచ్చేయమని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశాడు.దాంతో సదా ఆ ప్రొడ్యూసర్ ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసింది ఆయన ఫోన్ తో పాటు చాలా మంది ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం మానేసింది దాంతో విసిగిపోయిన వాళ్లు సదా కిడ్నాప్ అయిందని రూమర్ ని క్రియేట్ చేశారు.దీంతో వాళ్ళ అమ్మ బయటకు వచ్చి మా అమ్మాయి కిడ్నాప్ కాలేదు మా దగ్గరే ఉంది ఎందుకు ఇలాంటి న్యూస్ క్రియేట్ చేస్తున్నారు అని మీడియా ముందుకు వచ్చి చెప్పింది.
దీంతో ఆ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ల దగ్గరికి సదా నీ పిలిపించి తను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి తీసుకున్నాడు.దీంతో అందరి ముందు సదా పరువు పోయినట్లు అయింది ఇక అప్పటి నుంచి ఏ ప్రొడ్యూసర్ సదాను నమ్మకుండా పోయారు ఒక్క ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం అనేది సదా కెరియర్ ని నాశనం చేసింది.
ఒకప్పుడు జయం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా సదా సినిమాలో చెప్పిన డైలాగ్ అందరూ చెప్పేవారు వెళ్లవయ్యా వెళ్ళు అనుకుంటూ అలాంటి సదా తెలుగులో అగ్ర హీరోయిన్ గా వెలిగిపోవాల్సిన తను ఇప్పుడు బుల్లితెరపై డీ జోడి లో జడ్జిగా చేస్తుంది.ఇండస్ట్రీలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా లేకపోయినా మన బిహేవియర్ బాగుంటే సినిమా ఛాన్స్ లు అవే వస్తాయి టాలెంట్ ఉండి బిహేవియర్ బ్యాడ్ గా ఉంటే వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.ప్రొడ్యూసర్ ఫోన్ చేసినప్పుడు సదా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అంత రాద్ధాంతం జరిగేది కాదు.అందుకే ఇండస్ట్రీ లో ఉన్నప్పుడు మనం ఎంత స్టార్ డమ్ లో ఉన్నా కూడా కొంచెం అనిగిమనిగి ఉంటే ఎక్కువ కాలం పాటు ఇక్కడ కొనసాగడానికి ఆస్కారం వుంటుంది.
ప్రస్తుతం బుల్లితెరపై సదా తనదైన జడ్జిమెంట్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది బుల్లితెరపై మంచి పేరు సంపాదించుకున్న అప్పటికి ఒక స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సిన సదా ఇలా బుల్లితెరకి మాత్రమే పరిమితం అవడం అనేది ఆమె ఫ్యాన్స్ చాలా మంది జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి…
.