పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత ఇటీవలే పవన్ భీమ్లా నాయక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.
ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.ప్రస్తుతం పవన్ వరుస సినిమాలను లైన్లో పెడుతూ స్పీడ్ పెంచేస్తున్నాడు.
ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ‘హరి హర వీరమల్లు‘ సినిమా ఒకటి.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన షూటింగ్ ఇప్పటి వరకు జరగలేదు.పవన్ భీమ్లా నాయక్ సినిమా తర్వాత షూటింగ్ కు గ్యాప్ ఇచ్చాడు.అయితే పవన్ మళ్ళీ శ్రీరామ నవమి పండుగ సందర్భంగా హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసాడు.
ఈ షెడ్యూల్ శరవేగంగా జరగుతుంది.
ఇంకా 40 శాతం షూటింగ్ మిగిలి ఉండడంతో జూన్ లేదా జులై లోపు ఈ సినిమా మొత్తాన్ని పూర్తి చేయాలనీ పవన్ భావిస్తున్నాడు.
అందుకే ఫాస్ట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.ఇదిలా ఉండగా పవన్ క్రేజ్ గురించి అందరికి తెలుసు.

ఈ సినిమా విషయంలో మాత్రం నిర్మాత ఏ ఎం రత్నం లేటెస్ట్ గా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో హుషారు నింపాయి.పవర్ స్టార్ స్టార్డం కోసం అందరికి తెలుసు కానీ ఈ సినిమా ద్వారా పవన్ ని మరో లెవల్లో నిలబెడుతుందని దాని కోసం చేయాల్సినవన్నీ చేస్తున్నామని కష్టపడి పవన్ ని వేరే లెవల్లో ప్రెసెంట్ చేయడమే మా టార్గెట్ అంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.







