రాజన్న సిరిసిల్ల జిల్లా :కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సీసీఆర్ ) సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కార్యాలయలలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రతి పోలీస్ స్టేషన్లలో ఆడియో రికార్డులతో కూడిన సీసీ కెమెరాలు నియమించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టిఐ సూచిక బోర్డులు తప్పక అమర్చాలని తెలిపార.
ఆర్టిఐ ఆక్టివిస్టులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.కార్యక్రమంలో నేవూరి రత్నాకర్, సంధి శ్రీనివాస్ రెడ్డి, ఎర్ర బాలకిషన్, సయ్యద్ సలీం, యశోద రాజు ఉన్నారు.