రాజన్న సిరిసిల్ల జిల్లా,ఎల్లారెడ్డిపేట్ మండలం తిమ్మాపూర్ వద్ద 9వ ప్యాకేజి కాలువను సందర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.సింగసముద్రం 9 వ ప్యాకేజీ కాలువ పనులు పూర్తి చేయకపోవడానికి కారణాలపై అధికారులను ఫోన్ ద్వారా ప్రశ్నించిన రేవంత్.
పనులు ఆలస్యం చేయడం ద్వారా అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంటుందని,పనులు సరిగా చేయడం లేదన్న నెపంతో కేటీఆర్ తన అనుయాయులకు పనులు అప్పగించారు అని అన్నారు.కాలువ పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచారని ,లాభాలు దండుకుని, మిగిలిన పనులను గాలికొదిలేశారు అన్నారు.
పనులు ఆలస్యం కావడానికి , అంచనా వ్యయం పెరగటానికి కారణమైన సంస్థ గుర్తింపును రద్దు చేయాలి అన్నారు.కేటీఆర్ కాంట్రాక్టర్లకు లొంగిపోవడం వల్లే పనులు ఆలస్యమయ్యాయని,.
కమీషన్ల కక్కుర్తితో కేటీఆర్ రైతులకు అన్యాయం చేస్తున్నారు అని, తక్షణమే 9వ ప్యాకేజి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ గౌడ్, నాగరాజు, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.