శబ్ద కాలుష్యానికి కారణమైన వాహనాల సైలెన్సర్లు ద్వంసం.

భారీ శబ్దాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు:అదనపు ఎస్పీ చంద్రయ్య( SP Chandraiah ).రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) ఆదేశాల మేరకు గత నెల రోజులలో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి భారీ శబ్దాలు చేసేలా సైలెన్సర్లను ఏర్పాటు చేసుకొని శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న 55 వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధించి వాటి యెక్క సైలెన్సర్లను తొలగించి సిరిసిల్ల పట్టంములోని అంబేద్కర్ చౌక్ వద్ద రోడ్ రోలర్ తో ద్వంసం చేసి ఆ వాహనాలకు కొత్త సైలెన్సర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను వాహనాలకు బిగించే మెకానిక్ లపై కేసులు నమోదు చేస్తామని, శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను బిగించి రెండవసారి పట్టుబడిన వాహనదారుల వాహనాలను సీజ్ చేయడంతోపాటు, కేసులు నమోదుచేసి న్యాయస్థానాల్లో హాజరుపరుస్తామని హెచ్చరించారు.సీజ్ చేసిన వాహనాలను న్యాయస్థానం ద్వారా విడిపించుకోవడం అంతసులువు కాదని, అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.

 Vandalism Of Vehicle Silencers Causing Noise Pollution.-TeluguStop.com

శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను వాహనాలకు మెకానిక్ లు బిగించవద్దని వాహనాలు పట్టుబడిన సందర్భాలలో వివరాలు సేకరించి ఆటోమోబైల్ దుకాణాదారులు, మెకానిక్ పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.భారీ శబ్దాలను చేస్తున్న వాహనాల వల్ల గుండె జబ్బులు కలిగిన వారు,వయస్సు మీదపడిన వృద్ధులు భయపడుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు.

కంపెనీ ద్వారా తక్కువ శబ్దం కలిగిన సైలెన్సర్ల స్థానంలో కొందరు ఇతర సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారాని, అలాంటి వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆదనపు ఎస్పీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల టౌన్ సి.ఐ అనిల్ కుమార్, ట్రాఫిక్ ఎస్.ఐ లు రాజు,దిలీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube