తెలుగు లో ప్రిన్స్ గా సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన హీరో మహేష్ బాబు…ఈయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram ) కలయికలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.అదే గుంటూరు కారం.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది.షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుందని మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు.మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ ఇది…

ఇంతకు ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతడు, ఖలేజా( Khaleja ) వంటి సినిమాలు చేశాడు.వీటి ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి.అయితే రెండు సినిమాల దెబ్బకు మహేష్ చాలా ఏళ్లు త్రివిక్రమ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ఈ క్రమంలోనే త్రివిక్రమ్ పై నమ్మకం లేక గతంలో ఓ బ్లాక్ బస్టర్ మూవీని సైతం రిజెక్ట్ చేశాడు.ఇంతకీ ఆ సినిమా మారేదో కాదు.`జులాయి`…

అల్లు అర్జున్, ఇలియానా ఇందులో జంటగా నటిస్తే.త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా కూడా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పైనే నిర్మితం అయింది.దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.2012లో రిలీజ్ అయిన ఈ చిత్రం.తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ పంచ్‌లు, డైలాగ్స్ గట్టిగా పేలాయి.అలాగే అల్లు అర్జున్ నటన, డైలాగ్ డెలివరీ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి…
సోనూసూద్ విలనిజం, రాజేంద్రప్రసాద్-బ్రహ్మానందం కామెడీ టైమింగ్, ఇలియానా అందాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
దాంతో సినిమా ఘన విజయం సాధించి.బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
అయితే వాస్తవానికి జులాయి మూవీ ( Julayi )కథను త్రివిక్రమ్ మహేష్ బాబు కూడా సిద్ధం చేశాడట.కథ మహేష్ కు వినిపించగా.
వెంటనే నో చెప్పేశాడట.అంతకే ముందే త్రివిక్రమ్ తో చేసిన అతడు, ఖలేజా ఫ్లాప్ అయ్యాయి.
అందుకే మహేష్ జులాయి కథ నచ్చినా రిజెక్ట్ చేశాడట.దురదృష్టం అంటే ఇదేనేమో.
ఆనాడు త్రివిక్రమ్ ను నమ్మి ముందడుగు వేసుంటే జులాయి వంటి బ్లాక్ బస్టర్ మహేష్ ఖాతాలో పడేది…మరి ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో అయిన భారీ సక్సెస్ కొడతారా లేదా అనేది వేచి చూడాల్సిందే…
.