సంకెపల్లి లో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎంపీ బండి సంజయ్ కుమార్.ఈ సందర్బంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులను డిఫాల్టర్లుగా మారిస్తే అప్పులెట్లా ఇస్తారు?తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను దోచుకుంటుంటే పట్టించుకోరా?కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా వడ్లు ఎందుకు కొనడం లేదనీ తీవ్రంగా మండిపడ్డారు.

 Bandi Sanjay Inspected The Paddy Purchase Centers In Sankepally, Bandi Sanjay ,p-TeluguStop.com

రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతన్నలు ఢిల్లీకి పంపడానికి పైసలుంటయ్… రైతులకు రూ.500 బోనస్ ఇవ్వడానికి పైసల్లేవంటారా? ప్రక్రుతి వైపరీత్యాలతో పంట నష్టపోతే ఇన్ ఫుట్ సబ్సిడీ ఎందుకివ్వరనీ 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయరని ప్రశ్నిస్తే నాపై అవినీతి ఆరోపణలు చేస్తారా? అని అన్నారు.సర్కార్ మీదే కదా….దమ్ముంటే కేసులు పెట్టండి.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన ఘనత మోదీదే.పడిగాపులు కాస్తున్నా వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ వాపోయిన రైతులు.

తాలు, తరుగు పేరుతో క్వింటాలుకు 4 నుండి 7 కిలోలు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇచ్చిన హామీ మేరకు తాలు, తరుగు లేకుండా వడ్లను కనీస ధరకు కొనుగోలు చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బండి సంజయ్ కుమార్.

ఆయన వెంట బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube