ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్ ఆదేశించారు.ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Arrangements For Inter Advanced Supplementary Examinations , Inter Advanced Sup-TeluguStop.com

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడారు.పరీక్ష కేంద్రాలను శుభ్రం చేయించాలని, తాగునీటి వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.

వైద్య సిబ్బంది వద్ద మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా పెట్టుకోవాలని, పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఆర్టీసీ వారు బస్ లను సమయానుకూలంగా నడిపించాలని, సెస్ అధికారులు విద్యుత్ కోతలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.పరీక్ష పత్రాలు పోలీస్ బందోబస్తు మధ్య తరలించాలని, చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరా లు ఉండాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

ఉదయం.మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన  విద్యార్థులు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్నారు.

ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 2222 మంది, సెకండ్ ఇయర్ పరీక్షలకు 1412 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 24 వ తేదీ నుంచి వచ్చే నెల (జూన్ 1 వ తేదీ) దాకా నిర్వహించనున్నారు.ఫస్ట్ ఇయర్ వారికి పరీక్షలు ఉదయం 9 గంటలకు మొదలై పగలు 12 గంటల దాకా, సెకండ్ ఇయర్ వారికి 2.30 గంటలకు మొదలై 5.30 గంటల దాకా చేపట్టనున్నారు.జిల్లాలో మొత్తం 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

కేంద్రాలు ఇవే.

గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బాయ్స్ సిరిసిల్ల,
సెస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గర్ల్స్ సిరిసిల్ల,
టీఎస్ డబ్ల్యూర్ఎస్ జూనియర్ కాలేజీ(బాలికల) బద్దెనపల్లి, సాయి శ్రీ జూనియర్ కాలేజీ అనంతనగర్ సిరిసిల్ల,
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోనరావుపేట,
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఇల్లంతకుంట,
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వేములవాడ,
వివేకానంద జూనియర్ కాలేజీ సాయి నగర్ వేములవాడ,
సుమిత్ర శ్రీ ఒకేషనల్ జూనియర్ కాలేజీ వేములవాడ,
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ చందుర్తి,
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గంభీరావుపేట్,
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ముస్తాబాద్,
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎల్లారెడ్డిపేట్, రాచర్ల జూనియర్ కాలేజీ గొల్లపల్లిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

144 సెక్షన్ అమలు.ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు.

పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు.

పర్యవేక్షణకు బృందాలు.

పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు.  డీఈసీలు ఇద్దరు, చీఫ్ సూపరింటెండెంట్లు 14, డిపార్ట్ మెంటల్ అధికారులు 14, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు 4, సిట్టింగ్ స్క్వాడ్ ఇద్దరు, ఫ్లయింగ్ స్క్వాడ్ ముగ్గురు, కస్టోడియన్స్ ఇద్దరిని నియమించామని తెలిపారు.

సమావేశంలో డీఈఐఓ మోహన్, డీఈఓ రమేష్ కుమార్, డీఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube