అక్రమంగా తరలిస్తున్న 20 క్విటాళ్ల పిడిఎస్ రైస్ ను పట్టుకున్న రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు శనివారం టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ మారుతి తన సిబ్బంది తో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు కొనరావుపేట్ మండలం కొండాపూర్ గ్రామం నుండి సిరిసిల్ల లోని లక్ష్మీ ఇండస్ట్రీస్ కి గుంట సంయోల్ s/o కొమురయ్య,20 క్విటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం ను టి ఎస్ 01 యు బి 4798 అను నెంబర్ గలా ట్రాలీ ఆటో లో తరలిస్తుండగా సిరిసిల్ల లోని రగుడు చౌరస్తా వద్ద వారిని పట్టుకొని ఆటోలు,

 Rajanna Sirisilla Task Force Police Seized 20 Quintals Of Pds Rice Being Smuggle-TeluguStop.com

రేషన్ బియ్యం ను స్వాధీన పరుచుకొని వారిని అదుపులోకి తీసుకోని తదుపరి చర్యల నిమిత్తం వారిని మరియు ఆటోలను, పి డి ఎస్ రైస్ ను సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది.

ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఎస్.ఐ లు మాట్లాడుతూ పేదలకు అందవలసిన ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసిన, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇట్టి టాస్క్ లో టాస్క్ఫోర్స్ ఎస్.ఐ లు మారుతి,శ్రీకాంత్, రాజేష్, తిరుపతి,మహిపాల్,శ్రీనివాస్,మహిపాల్, అక్షర్,సమీయెద్దీన్, పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube