బీసీ విద్యార్థి సంఘం లో భారీగా చేరిన విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: బీసీ విద్యా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం బీసీ సంఘంలో చేరడం జరిగింది.వాళ్లకు సాధారణంగా కండవ కప్పి స్వాగతం తెలిపిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.

 A Large Number Of Students Have Joined The Bc Student Body, Bc Students Union, R-TeluguStop.com

అనంతరం అయన మాట్లాడుతూ బీసీ విద్యార్థి సంఘం లో చేరినందుకు సంతోషమని అన్నారు.విద్యార్థులకు రావలసిన పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నూతనంగా చేరిన విద్యార్థులు విద్యా రంగ సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని లేనియెడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రం 1200 మంది విద్యార్థుల బలిదానంతోనే వచ్చిందని గుర్తు చేశారు.కేసీఆర్ విద్యార్థుల సమస్యలను పట్టించుకోని వెంటనే పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రుద్రవీణ సుజిత్, చింటూ, గూట్ల రాహుల్, పరకాల సిద్ధార్థ,చింత వినయ్, కోడి రోహిత్,తడక రమణ, ప్రశాంత్, నరేష్, ఎండి సాహెబ్, ఎండి హసన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube