నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి మోసానికి పాల్పడిన రాగులు రాములు అరెస్ట్ , రిమాండ్ కి తరలింపు:సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి.

రాజన్న సిరిసిల్ల జిల్లా :భూమి విషయంలో చీటింగ్ చేస్తూ, తప్పుడు కాగితాలు తయారు చేసి సంతకాలు ఫోర్జరీ చేసి, భూమి హద్దులు చూపకుండా రిజిస్ట్రేషన్ చేసి చంపుతానని బెదిరించిన సిరిసిల్ల( Sircilla )చెందిన రాగుల రాములు( Ramulu ) పై సిరిసిల్ల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించనట్లు డిఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…సిరిసిల్ల పట్టణం సంజీవయ్య నగర్ కి చెందిన రాగుల రాములు అనే వ్యక్తి గత 10 సం:ల క్రితం పద్మనగర్ లోని సుర్వే నంబరు 960/బి , లో 363 చదరపు గజాల భూమి ఉందని దాని జిరాక్స్ కాగితాలు ఎల్లారెడ్డిపేట్ కి చెందిన ఉప్పుల నారాయణ తండ్రి రామయ్య కు చూపించగా నారాయణ అట్టి భుమీ నిజంగానే ఉందని నమ్మి అట్టి భూమికి 3.00,000/-రూపాయలు ఇచ్చి కొనుక్కొని సిరిసిల్ల సబ్ రిజిష్త్రర్ కార్యలయం నందు రిజిస్ట్రేషన్ ( Registration )చేపించుకొన్న తర్వాత హద్దులు చూపించమంటే హద్దులు చూపకుండా తప్పించుకుంటు తిరుగుతుండగా,నారాయణ డాక్యుమెంట్ నంబరు 2875/2013 ప్రకారం నారాయణ( Narayana ) తసీల్దార్ కార్యాలయములో చెక్ చేసుకోగా అట్టి భూమి ప్రభుత్వానికి చెందినదని ఉండగా నారాయణ రాగుల రాములు చేతిలో మోసపోయిన అని గ్రహించి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా రాగుల రాములు పై కేసు నమోదు చేసి ఎల్లారెడ్డిపేట్ కి చెందిన నారాయణను మోసం చేశాడని విచారణలో తెలగా రాగుల రములు ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

 Ragulu Ramulu, Who Committed Fraud By Creating Fake Documents, Was Arrested And-TeluguStop.com

నిందితుడు అయిన రాగులు రాములు పై భూ కబ్జాలకు ,చీటింగ్ లకు సంబంధించి గతములో సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో 20 కేసులు ఉన్నాయని రాగులు రాములు చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube