కుట్టు శిక్షణ కార్యక్రమాల ఏర్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా :మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఇందులో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరు 9వ వార్డులో బాబాజీ నగర్ లో ఈరోజు స్థానిక కౌన్సిలర్ సత్తయ్య ఆధ్వర్యంలో వేములవాడలోని చెక్కపల్లిలో సర్పంచ్ అధిక జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది.

 Organization Of Sewing Training Programs In Rajanna Sircilla, Sewing Training P-TeluguStop.com

ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం హాజరై ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.బాలికలు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని వేసవికాలంలోని విరామ సమయాన్ని నైపుణ్యం పెంపొందించుకోవడానికి జ్ఞాన సంపాదనకు ఉపయోగించుకోవాలని సూచించారు.

అలాగే ప్రత్యేక శిక్షణ పొందిన వారి చేత ఈ కార్యక్రమాల నిర్వహించబడుతున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని బాలికలకు సూచించారు.అలాగే ఈ కార్యక్రమంలో వారికి మహిళల పట్ల జరుగుతున్న వివక్షను అంతం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి పథకాలను షీ టీం, విమెన్ హెల్ప్ లైన్ నెంబర్లు 181, ఫైండ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 వంటి అంశాలను గురించి వివరించడం జరిగింది.

అలాగే ఈ కార్యక్రమంలో మహిళా సాధికారికథకు ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను అంగన్వాడి కేంద్రాలలో అందించే వివిధ పథకాలను లబ్ధిదారులకు అందించేటువంటి పోషకాహారం వివరాలను అందరికీ తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమాలలో సిడి సిరిసిల్లలో సిడిపిఓ అలేఖ్య సూపర్వైజర్ దివ్య అంగన్వాడీ టీచర్లు, వేములవాడలో సిడిపివోలు ఎల్లయ్య సుచరిత సూపర్వైజర్లు అందరూ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube