ఎల్లారెడ్డిపేట మండలంలో 7 రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె బుధవారం ఏడవ రోజుకు చేరుకుంది.మండలంలోని 24 గ్రామపంచాయతీ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.

 Gram Panchayat Workers Strike For 7 Days In Ellareddypet Mandal, Gram Panchayat-TeluguStop.com

ఈ సమ్మెలో జిల్లా యూనియన్ గ్రామపంచాయతీ ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ మాట్లాడుతూ సమ్మె విచ్చిన్నం చేయడానికి పై అధికారులు నాయకులు చేస్తున్నారని, గ్రామంలోపరిశుభ్రత కొరకు ఇతరులను కూలీలను తీసుకువచ్చి మురికి కాలువలు రోడ్లు శుభ్రం చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు.దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు.

తాగునీటి సరఫరాకు ఇచ్చిన మినహాయింపును వెనక్కి తీసుకొని త్రాగునీటి సరఫరా బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ సమ్మెలో గౌరవ అధ్యక్షులు రేసు రాజయ్య, మండల అధ్యక్షులు జక్కుల మహేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నారాపురం నరసయ్య, గాదం రాందాస్, బాయికాడి చిన్న లక్ష్మి, పండుగ భారతవ్వ, లక్ష్మి, నరసయ్య, కొత్త రాజు, దేవయ్య, నరసయ్య, బాలయ్య, రాజయ్య, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube