రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సొంత బావమరిది జోగిని పళ్లి శ్రీనివాసరావు తండ్రి కేశవరావు గ్రామ దేవత పోచమ్మ తల్లి ని దర్శించుకుని నిర్మాణ పనులు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చందాగా (100,000) లక్ష రూపాయలు అందజేశారు.
సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు.గ్రామ ప్రజల మధ్య కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు ,ప్రజలు పాల్గొన్నారు.