శాంతియుత వాతావరణంలో దసరా వేడుకలు జరుపుకోవాలి

ఎల్లారెడ్డి పేట ఎస్.ఐ రమాకాంత్ :శాంతియుత వాతావరణంలో దసరా వేడుకలు(Dussehra Celebration) జరుపుకోవాలని ఎల్లారెడ్డి పేట ఎస్.ఐ రమాకాంత్(SI Ramakanth) మండల ప్రజలకు సూచించారు.ప్రశాంతంగా పండగును జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వేడుకలు నిర్వహించుకోవాలని తెలిపారు.దసరా సందర్భంగా ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.అదేవిధంగా ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ (Drunk and drive)తనిఖీలను నిర్వహించడం జరుగుతుందని, ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడుపరాదని పేర్కొన్నారు .అంతేగాకుండా దేవీనవరాత్రుత్సవాల్లో భాగంగా అమ్మవారి నిమజ్జన వేడుకలను సైతం ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ఎలాంటి డిజెలకు అనుమతి లేదని, కేవలం భక్తి పాటలతో అమ్మవార్ల ఊరేగింపు చేపట్టి, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జనం చేయాలని మండపాల నిర్వహకులకు సూచించారు.ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

 Dussehra Should Be Celebrated In A Peaceful Atmosphere-TeluguStop.com

ఈ సందర్భంగా మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube