ప్రజల రక్షణ, భద్రత కోసమే పోలీస్

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని,అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నాం అని స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రవికుమార్ అన్నారు.ఈ రోజు ఉదయం 60 మంది పోలీసులతో వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సరైన పత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు,01 ట్రాక్టర్, సీజ్ చేసి సరైన పత్రాలు చూపించి తీసుకవేళ్ళవచ్చు అని,గ్రామంలో దండుగుల నరసయ్య ఇంట్లో అడవి జంతువులను వేటాడడానికి ఏర్పాటు చేసుకున్న వల,వైరు,శివరాత్రి రమ ఇంట్లో దుప్పి కొమ్ము, వైరు స్వాధీన పర్చుకొని ఈరువురిని బైండోవర్ చేయడమైనది.

 Community Contact Program In Kancharla Village Of Veernapalli Mandal, Community-TeluguStop.com

ఈ సందర్భంగా డిఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ….నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రజల రక్షణ, భద్రత కోసమే పోలీసింగ్ ఉందని,గ్రామాల్లో కొత్త వ్యక్తులు,నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా డయల్ 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని,యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.గ్రామాల్లో కి గంజాయి మూలాలు రాకుండా చూసుకోవలసిన బాధ్యత గ్రామ ప్రజలాదే అని అలాంటి సమాచారం ఉంటే పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా,ట్రాఫిక్ నియమాలను పాటించాలని,వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు.డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని,గ్రామాల్లో అటవీ జంతువులను వేటాడిన అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలు అమార్చన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని,అనిమల్ యాక్ట్ గురించి వారికి తెలియజేయడం జరిగింది.గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ.

కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సి.

ఐ మోగిలి, ఎస్.ఐ లు నవత, శేఖర్,మహేష్,రాజేష్ ఆర్.ఎస్.ఐ కు రమేష్,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube