మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్....

యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి సిరిసిల్ల జాబ్ మేళాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పోలీసుల శాఖ ఆద్వర్యంలో నిర్వహణ హాజరైన కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్పీ అఖిల్ మహాజన్.మెగా జాబ్ మేళాకు విశేష స్పందన,సుమారు 8000 మంది హాజరు.

 Mega Job Mela Grand Success , Mega Job Mela, Adi Srinivas , Dsp Chandrasekhar Re-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా :యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కల్యాణి లక్ష్మి ఫంక్షన్ హాల్ లో గురువారం  ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళ నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాగాన్ని విప్ అభినందించారు.

మెగా జాబ్‌ మేళాకు ముందుగా అన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న సుమారు 8000 మంది యువత పెద్ద సంఖ్యలో మేళాకు తరలిరాగా, ఆరువైకి  పైగా వివిధ కంపెనీలకు చెందిన హెచ్‌.ఆర్‌లు వచ్చి యువతకు సంబంధించి విద్యార్హతలను బట్టి ఇంటర్యూలు నిర్వహించి సెలెక్ట్ అయినవారికీ తమ సంస్థల్లో పనిచేసేందుకు నియామక పత్రాలను అందించారు.

అనంతరం విప్ మాట్లాడుతూ డ్రగ్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, యువత ఉద్యోగ అవకాశాలని అందిపుచుకోవాలని,కష్టపడి పనిచేయాలనుకునే యువత కోసం ఉద్యోగ అవకాశాలు క్యూ కడుతాయని పేర్కొన్నారు.వారం రోజులపాటు పోలీస్ అధికారులు, సిబ్బంది నిరుద్యోగులకు అవగాహన సమావేశాలు నిర్వహించి, విజయవంతం చేశారని కొనియాడారు.

శాంతి భద్రతలు కాకుండా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం పోలీస్ వారు చేయడం అభినందనీయమని వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఇప్పటికే 30 వేల నియామకాలు చేశామని వెల్లడించారు.ఇటీవల గ్రూప్ – 1 పరీక్ష నిర్వహించామని, త్వరలో మెగా డీ ఎస్ సి చేపట్టునున్నామని తెలిపారు.

స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్ అందించి స్థానికంగా, ఇతర దేశాల్లో ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంతున్నామని పేర్కొన్నారు.దుబాయ్ ప్రతినిధులతో పిలిపించి, అక్కడ కంపెనిలకు ఉపయోగ పడేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడ్డుతు యువత కోసం జాబ్ మేళ నిర్వహించిన ఎస్పీ, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.యువత తమకు అందిన అవకాశాలను అందిబుచ్చుకోని తమకు అనుకూలంగా మార్చుకోని ఉద్యోగాల్లో రాణించాలని,కష్టపడి పనిచేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవడంతో పాటు, ఏ ప్రాంతంలో అయిన పనిచేసేందుకు సిద్ధపడివుండాలన్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.వెయ్యి కిలో మీటర్ల ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే ప్రారంభం అవుతుందని, అలాగే యువత ఖాళీగా వుండకుండా తన విధ్యార్హతకు తగిన ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా, వచ్చిన ఉద్యోగంలో ప్రతిభ కనబర్చడం ద్వారా యువత అనుకున్న లక్ష్యాలను సాధించడం సులవుతుందని, వచ్చిన అవకాశాలను అందిబుచ్చుకోని ముందుకు సాగిపోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రచారి, మురళి కృష్ణ, సి.ఐ లు రఘుపతి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఆర్.ఐ లు యాదగిరి, రమేష్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ అనిల్ కూమార్, సిబ్బంది, వివిధ కంపెనీల హెచ్.ఆర్ లు నిరుద్యోగ నివారణ ఫండేషన్ సిబ్బంది యువత పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube