రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మినీ స్టేడియంలో మంగళవారం రోజు కేజీబీవీ విద్యార్థినులకు జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు.జరిగిన ఖోఖో పోటీలో బోయినపల్లి కేజీబీవీ విద్యార్థులు రెండవ స్థానంలో నిలిచారు.
వీరికి జిల్లా విద్యాధికారి రమేష్ ,జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.పలువురు విరిని అభినందించి మాట్లాడుతూ క్రీడలు పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి తోడ్పడతాయని విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో కూడా రాణించాలని
విద్యార్థులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు.
రెండవ బహుమతి సాధించిన విద్యార్థినిలను పిఈటీ మౌనిక లని కేజిబివి ఎస్ ఓ పద్మ అభినందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కళా చక్రపాణి, వార్డ్ కౌన్సిలర్ రాపల్లి అరుణ లక్ష్మీనారాయణ, జండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్ పద్మజ ,మహిళా సాధికారిక కేంద్రం కోఆర్డినేటర్ రోజా, ఎస్టిఎఫ్ సెక్రటరీ దేవతా ప్రభాకర్, వ్యాయామ ఉపాధ్యాయులు, కేజీబీవీ విద్యార్థునిలు పాల్గొన్నారు.