రాజన్న సిరిసిల్ల జిల్లా: వానాకాలం సీజన్లో పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులపై జిల్లాలోని రైతులకు వ్యవసాయ శాస్ర్తవేత్తలు, అధికారులు సలహాలు, సూచనలు అందిస్తారని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట, వేములవాడ పరిధిలోని హన్మాజీపేట రైతు వేదికల్లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11.10 గంటల దాకా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వానాకాలంలో విత్తనాల ఎంపిక, సాగు పద్ధతులు, రైతుల అనుభవాలు, శాస్ర్తవేత్తలు సలహాలు అందిస్తారని వివరించారు.జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.