కొనసాగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి హెచ్ సి) లో తాను ఉపసర్పంచ్ గా కొనసాగుతున్న సమయంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల గర్భవతులకు, బాలింతలకు వంటలు చేసి వడ్డించడానికి ఇబ్బందులు అవుతున్నాయని ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నీ కలిసి వివరించగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఏడున్నర లక్షలు మంజూరు చేయగా అట్టి నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనుల ను తాజా మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి లు పరిశీలించారు.

 Monitoring Of Ongoing Development Works, Development Works, Rajanna Sircilla, Y-TeluguStop.com

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఫార్మసీ స్టోర్ రూం, మూత్ర శాలల పనులు జరుగుతుండగా వాటిని పరిశీలించడం జరిగింది.

పనులు పూర్తి కావస్తుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.మరో పదిహేను రోజులలో పనులు పూర్తై గర్భవతులకు, బాలింతలకు వినియోగంలోకి రానుండడంతో తాజా మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ సంతృప్తి వ్యక్తం చేశారు.

వీరి వెంట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు బాబు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube