వేసవి కాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా చూసుకోవడం ఎంతో ముఖ్యం.బాత్ లవణాలు చర్మ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి.
ముఖ్యంగా ఎండాకాలంలో వేడికి ఆరోగ్యన్ని రక్షించుకోకపోతే కళ్ళు తిరగడం, అధిక బీపీ, లోబిపి ఉంటే అనేక సమస్యలు వస్తాయి.చర్మాన్ని సరిగా చూసుకోనప్పుడు చర్మం పై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి.
అందువల్ల ఈ సమస్యలన్నీటిని దూరం చేసుకోవడానికి బాత్ లవణాలు ఎంతో ఉపయోగపడతాయి.అసలు బాత్ లవణాలు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది ఒక రకమైన స్నానపు ఉప్పు.ఇది క్రిస్టల్ లాగా కనిపిస్తుంది.

బాత్ లవణాలు సాధారణంగా మెగ్నీషియం సల్ఫేట్( Magnesium sulfate ) అంటే సముద్రపు ఉప్పుతో తయారు చేస్తారు.బాత్ లవణాలను స్నానపు నీటిలో కలిపి ఉపయోగిస్తారు.బాత్ సాల్ట్‌లు చర్మానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.ఎందుకంటే ఇందులో చాలా రకాల మూలకాలు ఉంటాయి.బాత్ సాల్టులు ఒత్తిడిని( Stress ) తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మొదటిగా స్నానం చేయడానికి వెచ్చని నీటితో బాత్ టబ్‌ను నింపాలి.తర్వాత సాల్ట్ వేసి పది నుంచి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి.ఇలా చేయడం వల్ల నీటిలో సాల్ట్ బాగా కలిసిపోతుంది.
ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నీటితో స్నానం చేయాలి.ఈ నీటిలో పిప్పరమెంటు నూనెను కూడా కలిపి స్నానం చేయవచ్చు.
ఇంకా చెప్పాలంటే స్నానపు లవణాలను షవర్ లో, టబ్‌లో స్క్రబ్ గా ఉపయోగించాలి.దీని కోసం ఒక కప్పు బాత్ సాల్ట్ 1/3 కప్ బాదం నూనె, ఆలివ్ నూనె( Olive oil ) కొబ్బరి నూనె కలిపి ఒక టేబుల్ స్పూన్ విటమిన్ ఇ కూడా తీసుకోవాలి.
పదార్థాలు అన్నిటిని ఒక గిన్నెలో వేసి శరీరానికి పట్టించాలి.అలాగే బాత్ సాల్ట్ లను ఉపయోగించడం వల్ల ఆందోళన, ఒత్తిడి మరియు డిప్రెషన్ లాంటి అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.