ఫీజు నియత్రణ చట్టం తీసుకురావాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్.ఈ సందర్బంగా ఆయన తెలంగాణ భవన్ లో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.

 A Fee Control Act Should Be Brought, Fee Control Act , Rajanna Sircilla District-TeluguStop.com

ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ప్రైవేట్ విద్య సంస్థలు విద్య వ్యాపారం చేస్తూ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారన్నారనీ అన్నారు.దీని పైన వెంటనే ఈ రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్య సంస్థ ల పై చర్యలు తీసుకొవాలని, ఎన్నికల హామీ లో విద్యార్థులకు ఇచ్చిన హామిలను విద్య సంవత్సరం ప్రారంభం కాగానే అమలు అయ్యేలా చేయాలనీ,ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ గురుకుల హాస్టల్, యూనివర్సిటీలలో మౌలిక వసతులు కల్పించి విద్య ప్రమాణాలు పెరిగేలా కృషి చేయాలన్నారు.ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని, విద్యార్థులకు ప్రభుత్వ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

ఫీజుల పేరుతో విద్య సంస్థలు చేస్తున్న దోపిడీ నీ అరికట్టి అలాంటి విద్య సంస్థలను ముసివేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరుపున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు ఎండి రియాన్, కొడం నరేష్,కొడం వెంకటేష్, సామల శ్రీకాంత్,రాపెల్లి భాను, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube