రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షులు మెరుగు జితేందర్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి పిల్లలకు మధ్యాహ్న భోజనం యొక్క సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలు తమ సొంత ఇంటి నుంచి ఆహారం తీసుకుని రావడం జరుగుతుందన్నారు.
పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను పాఠశాలలో ఉన్న సమస్యలు, మధ్యాహ్న భోజనంలో గత కొద్ది రోజుల నుంచి ఈ పరిస్థితి ఉందని అన్నారు.అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు రాక వంట చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు
గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం నిర్వీర్యం చేస్తూ పిల్లలకు పౌష్టికంగా లేని ఆహారాన్ని అందిస్తూ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉందని అన్నారు.
అలాగే స్థానిక ఎంఈఓ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించవలసిందిగా చర్యలు తీసుకోవాలన్నారు .విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికా ఆహారాన్ని అందించకుంటే ఎంఈఓ ఆఫీస్ నీ ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల బీజేవైఎం ఉపాధ్యక్షులు మార్పు దయాకర్ రెడ్డి, సనత్, దిలీప్,మధు,రోహిత్,సాయి, విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
.