ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీకాంత్.ఒకప్పుడు తను ఎన్నో కుటుంబ నేపథ్య సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
చాలా తక్కువ సమయంలో 100 సినిమాల క్లబ్ లో చేరాడు.తాజాగా తను హీరో పాత్రలో నుంచి విలన్ పాత్రలోకి మారాడు.
తాజాగా విడుదలైన బాలయ్య మూవీ అఖండలో అద్భుత రోల్ తో ఆకట్టుకున్నాడు.ఈ సినిమాలో బాలయ్యతో సమానంగా శ్రీకాంత్ నటన గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు.
తాజాగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడతంతో శ్రీకాంత్ పలువిషయాలు వెల్లడించాడు.తనకు ప్రస్తుతం హీరోగా.
విలన్ గా.రెండు వేర్వేరు పార్శాలునున్నాయని చెప్పాడు. హీరోగా డైలాగులు చెప్పడం వేరు.విలన్ గా చెప్పడం వేరని వెల్లడించాడు.ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కష్టమైందని వెల్లడించాడు.
ఒకప్పుడు తాను ఫ్యామిలీ సినిమాలు చేశానని.
మారుతున్న కాలానికి అనుగుణంగా మారకతప్పదని చెప్పాడు.అందుకే అఖండ సినిమాలో విలన్ పాత్ర పోషించానని చెప్పాడు.
ఈ కొత్త క్యారెక్టర్ నేను ఎలా చేస్తానోనని చాలా మంది అనుకున్నారని.కానీ అనుకున్న దానికంటే బాగానే చేసినట్లు చెప్పాడు.
అఖండ సినిమాలో తనను చూడడానే తన భార్య ఊహ భయపడిందని చెప్పాడు.ఓసారి సినిమా షూటింగ్ స్పాట్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లానని.అప్పుడు ఊహతో కొంత మంది కూర్చుని మాట్లాడుతున్నారని చెప్పాడు.అప్పుడు తనను చూసి వారంతా కంగారు పడ్డారని చెప్పాడు.ఇలాంటి పాత్రే ఆపరేషన్ దుర్యోధన సమయంలోనూ చేసినట్లు చెప్పాడు.
ఇక ముందు ఏ క్యారెక్టర్ చేయాలి అనేది తెలియదని చెప్పాడు.హీరోగా చేస్తాను.అవకాశం వస్తే విలన్ గా చేయడానికి వెనుకాడను అని చెప్పాడు.
అయితే తాజాగా నేను చేసిన క్యారెక్టర్ మాత్రం తన కేరీర్ కు ఎంతో ఉపయోగ పడిందని వెల్లడించాడు.హీరోగానే కాదు.విలన్ గా కూడా సత్తా చాట గలనని నిరూపితం అయ్యిందని వెల్లడించాడు.అఖండలో తాను చేసిన వరదరాజులు క్యారెక్టర్ ను జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పాడు.
బాలయ్య అభిమానులు తనకు ఫోన్ చేసి అభినందించడం సంతోషంగా ఉందన్నాడు.