పోటీ కార్మికులను పెట్టడం మానుకోవాలి..సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మోర అజయ్ డిమాండ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు.అనంతరం సూపరిండెంట్ విజయేందర్ రెడ్డి( Superintendent Vijayender Reddy ) కి వినతి పత్రం సమర్పించారు.

 Citu District Vice-president Mora Ajay Demanded That Competitive Workers Should-TeluguStop.com

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మోర అజయ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు జులై 6 నుండి తమ సమస్యలు పరిష్కరించాలని న్యాయబద్ధంగా సమ్మె చేస్తున్న విషయం తమరికి తెలుసునని ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారుల నుండి పై అధికారుల వరకు అందరికీ విన్నవించడం జరిగింది.ఇప్పటికీ సమ్మె చేయబట్టి దాదాపుగా నెల రోజులు దగ్గర పడుతున్న ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.

సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింప చేయవలసిన ప్రభుత్వం అలా చేయకుండా సమ్మెను విచ్చిన్నం చేయడానికి కొన్ని గ్రామాలలో అధికారులు పాలకులు ఒకరికి రోజుకు 1000 రూపాయల వరకు కూలి ఇచ్చి, గ్రామీణ ఉపాధి కార్మికులతో పోటీ కార్మికులను తీసుకువచ్చి పని చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.దీనివలన కార్మికుల మధ్య గొడవలు వస్తున్నాయన్నారు.

తరతరాలుగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా సమయంలో కూడా గ్రామ ప్రజలకు సేవలందించిన గ్రామపంచాయతీ కార్మికుల పట్ల పోటీ కార్మికులను పెట్టి వారి మధ్య గొడవలు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు.కడుపు కాళీ సమ్మె చేస్తున్న కార్మికులు ఈ కార్మికులను పెడితే గొడవలు పెరిగే అవకాశం ఏర్పడుతుందని, వెంటనే తమరు గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె కొనసాగినంత కాలం పోటీ కార్మికులను పెట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి కృష్ణవేణి, రవీందర్, కొల చంద్రం, కసాని రవీందర్ తిరుపతి, గొడిసెల నర్సవ్వ, వడ్లురి కనుకవ్వ, యేనగందుల భారతవ్వ,సంగుపట్లప్రేమల, వంతాడుపుల లక్ష్మి, మరియు కార్మికులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube