పంట పొలాలను పరిశీలించిన ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలు అంటూ మండిపడ్డారు.

 Congress Party Leaders Of Mustabad Mandal Inspected The Crop Fields Details, Con-TeluguStop.com

రైతుబంధును బూచిగా చూపిస్తూ రైతులకు ఎంతో మేలు చేసినం అని మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు సబ్సిడీల రూపంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.అకాల వర్షాల వల్ల గాని మరే విధంగా అయిన నష్టపోయిన రైతులకు త్వరగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే కానీ ఈ రాబందుల పాలనలో పంటకు నష్టపరిహారం అందిన దాఖలాలే లేవన్నారు.చత్తీస్గడ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతోపాటు

Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

ఒక క్వింటాలకు బోనస్ గా 600 రూపాయలు ఇస్తూ రైతులను ధనికులను చేసే పని చేస్తే ఈ ప్రభుత్వం రైతులకు కనీసం మద్దతు ధర కాదు కదా క్వింటాలు పై మూడు నాలుగు కిలోలు ఎక్కువగా తూకం వేస్తూ రైతుల నడ్డి విరుస్తుందన్నారు.ఇప్పుడైనా కేసీఆర్ సంబంధిత అధికారులతో ఏరియల్ సర్వే చేపట్టి పంట నష్టపోయిన రైతులకు త్వరగా నష్టపరిహారం అందించాలన్నారు.లేనియెడల రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, పోతుగల్ గ్రామ శాఖ అధ్యక్షులు అనమేని రాజు, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి,మాజీ ఎంపిటిసి తలారి నర్సింలు, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి, కేసుగాని చంద్రమౌళి, పర్షరాములు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube