ఆస్తమా. ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందిని వేధిస్తున్న శ్వాసకోశ వ్యాధి ఇది.పిల్లలు, పెద్దలు అనే తేడా లేదు.ఏ వయసు వారైనా ఈ వ్యాధి బారిన పడతారు.
దీర్ఘకాలిక వ్యాధి అయిన ఆస్తమా ఒక్కసారి వచ్చిందంటే జీవిత కాలం వేధిస్తూనే ఉంటుంది.దీని వల్ల ఊపరి సరిగ్గా ఆడకపోవడం, కొంచెం దూరం నడిచినా లేదా ఏదైనా పని చేసినా ఆయాసం రావడం, తరచూ ఛాతి బిగుతుగా మారడం, గురక, దగ్గు వంటి లక్షణాలు తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.
అందుకే ఆస్తమా ఉన్న వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.అనేక ఆరోగ్య నియమాలను పాటించాలి.అయితే ఆస్తమా రోగులకు అన్ని ఆహారాలు అంత మంచివి కావు.ముఖ్యంగా కొన్ని కొన్ని ఫుడ్స్‌కు ఆస్తమా ఉన్న వారు దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు నిపుణులు.
మరి ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
నిమ్మ రసం.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.బరువు తగ్గిస్తుంది.
అందుకే చాలా మంది ఉదయం లేవగానే నిమ్మ రసం తీసుకుంటారు.కానీ, ఆస్తమా ఉన్న వారు మాత్రం నిమ్మ రసాన్ని ఎవైడ్ చేయాలి.
లేదంటి ఆస్తమా లక్షణాలు మరింత ఎక్కువ అవుతాయి.
అలాగే పుల్లగా ఉండే ఆహారాలు, కీర దోస, నిల్వ పచ్చళ్లు, ఎండిన ఫలాలు వంటి వాటిని ఆస్తమా వ్యాధి గ్రస్తులు దూరం పెట్టాలి.
పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివే అయినా.ఆస్తమా ఉన్న వారు మాత్రం వీటిని చాలా అంటే చాలా లిమిట్‌గా తీసుకోవాలి.
లేదంటే శ్వాసలో ఇబ్బంది, ఆయాసం వంటివి తీవ్రంగా మారతాయి.అంతే కాదు, వేరుశనగలు, చేపలు, సోయా ఉత్పత్తులు, బీన్స్, క్యాబేజ్, ఉల్లిపాయ, వెల్లుల్లి, కూల్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన మాంసం వంటివి కూడా ఏ మాత్రం మంచివి కావు.
కాబట్టి, వీటిని వీలైనంత వరకు ఆస్తమా రోగులు తీసుకోవడం తగ్గించాలి.ఇక వైన్, బీర్, టీ, కాఫీలను పూర్తిగా ఎవైడ్ చేయాలి.