సీజన్ కు సంబంధం లేకుండా అరటి పండు ప్రతి సీజన్ లోనే అందుబాటులో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే అరటి పండు ధర పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
అరటి పండ్లు తినడం చాలా మందికి ఎంతో ఇష్టం.అయితే అరటి పండ్లు ఒక్కోసారి జంటగా కూడా మార్కెట్లో లభిస్తుంటాయి.
అలా ఉన్న అరటి పండ్లను చూస్తే చాలా మంది కి మంచిగా అనిపిస్తూ ఉంటుంది.అయితే మన పెద్ద వారు జంట అరటి పండ్లు( Couple of bananas ) తినకూడదు అని చెబుతూ ఉంటారు.
అలా తినడం వల్ల కవల పిల్లలు పుడతారు అని చెబుతూ ఉంటారు.

అయితే ఇందులో నిజం ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ చాలా మంది ఈ విషయాన్ని బలంగా నమ్ముతారు.జంట అరటి పండ్లు తింటే కవలలు పుడతారని భారతీయులే కాదు, ఫిలిప్పీన్స్ కూడా నమ్ముతారు.అంటే గర్భిణీ స్త్రీ ( Pregnant woman )తన మొదటి మూడు నెలలలో జంట అరటిపండు తింటే ఆమెకు కచ్చితంగా కవలలు పుడతారని నమ్మేవారు చాలా మంది ఉన్నారు.
అలాగే కొందరు కవలలు కావాలని కోరుకుంటూ ఉంటారు.కాబట్టి అలాంటి వారు జంట అరటి పండ్లను తింటూ ఉంటారు.

అయితే ఈ మాట ఎంత వరకు నిజం అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే ఒక జత అరటి పండ్లు కవలలను ఉత్పత్తి చేస్తాయని ఆలోచన శాస్త్రీయంగా( Scientifically ) ఎక్కడా నిరూపించబడలేదు.అరటి పండు తినడం ఆరోగ్యానికి మంచిది.ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల గర్భిణీలు దీన్ని తినవచ్చు.అందుకే అరటి పండ్లు తినాలని చెబుతూ ఉంటారు.కానీ వీటిని అతిగా కూడా తినకూడదు.
ఆరోగ్యానికి మంచిదైనా ఏ ఆహారం కూడా అతిగా తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.







