జిల్లాలో మహిళలకు,బాలికలకు,విద్యార్థినిలకు అండగా షీ టీమ్ సేవలు

మహిళలు,బాలికలు,విద్యార్థినిలు వేధింపులకు గురైనట్లు అయితే వెంటనే జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 లేదా డయల్ 100 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు.మహిళలు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రండి,వేధింపుల నుండి బయటపడండి, ఫిర్యాదు వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

 She Teams Services For Women, Girls And Students In The District ,she Teams ,-TeluguStop.com

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లాలో షీటీమ్స్ జనవరి 2023 నుండి ఏప్రిల్ 30 వరకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల, కేసుల వివరాలు వివరాలు.

జిల్లాలో గత నాలుగు నెలల్లో షీ టీమ్ నెంబర్ ద్వారా 110 ఫిర్యాదులు అందగా షీ టీమ్ సిబ్బంది మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీలను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి,2 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటుగా 2 పెట్టి కేసులు నమోదు చేయడం జరిగింది.

మహిళలను వేధిస్తున్న పోకిరాల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్న జిల్లా షీ టీమ్ బృందం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలో 120 హాట్ స్పాట్స్ ని గుర్తించి వాటిని షీ టీమ్స్ బృందాలు 230 సార్లు సందర్శించడం జరిగింది.

పాఠశాలలు, కళాశాలల్లో,పబ్లిక్ ప్రదేశాలలో,గ్రామాల్లో, పని చేసే ప్రదేశాల్లో 57 చోట్ల సుమారుగా 600 మంది విద్యార్థిని విద్యార్థులకు,మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి షీ టీమ్ ఉపయోగాలు, డయల్ 100, ర్యాగింగ్/ ఈవ్ టీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై, సైబర్ క్రైమ్ లపై, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ప్రత్యేక గుర్తింపు పొందిందని,మహిళ రక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ లు మహిళలకు, విద్యార్థినులకి ధైర్యాన్ని కల్పిస్తున్నాయి అని మహిళల,బాలికల వేధింపులకు వ్యతిరేకంగా పని చేస్తున్న జిల్లా షీ టీమ్ కి జిల్లా వ్యాప్తంగా వస్తున్న పిర్యాదులతో విద్యార్థినులకు, మహిళలకు ఎంతగానో చేరువైంది.

మహిళల,బాలికల, వివరాలు ఎక్కడ కూడా బయటపెట్టకుండా వారి యెక్క సమస్యలను కేవలం ఫోన్ ద్వారా లేదా క్యూ అర్ కోడ్ ద్వారా చెప్పే అవకాశం కల్పిస్తూ మహిళలకు బాలికలకు జిల్లా షీ టీమ్ అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుంది.ఆపద సమయంలో మహిళలు విద్యార్థినులు ఎలా స్పందించాలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ సబ్ డివిషన్ లలో విధులు నిర్వహిస్తున్న షీ టీమ్ బృందాలు జిల్లాలోని పాఠశాలల్లో,కళాశాలల్లో, బస్టాండ్,రద్దీగాల ప్రాంతాల్లో, మహిళాలు పని చేసే ప్రదేశాల్లో షీ టీమ్ బృందాలు సివిల్ డ్రెస్సుల్లో ఉండి ప్రతి రోజు ఆయా ప్రదేశాల్లో నిఘా పెట్టడడం జరుగుతుంది.

అంతే కాకుండా షీ టీమ్ బృందం పాఠశాలల్లో,కాలేజీలల్లో,గ్రామాల్లో పని చేసే ప్రదేశాల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి షీ టీం పని విధానం, పొక్సో ఆక్ట్, ఈవిటిజింగ్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్స్, గుడ్ టచ్, బాడ్ టచ్, అమ్మాయిల వేధింపులు గురి అయితే ఏ విధంగా స్పందించాలి మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు…మహిళలు, బాలబాలికాలు వేధింపులకు గురి ఐతే వెంటనేడయల్ 100 లేదా క్యూ ఆర్ కోడ్,జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 లేదా డయల్ 100,ద్వారా పిర్యాదు చేయవచ్చు.

ఎలాంటి వేధింపులకి గురైనా అమ్మాయిలు మౌనంగా భరించవద్దని,దైర్యంగా ముందుకి వచ్చి షీ టీం ని సంప్రదించాలని కోరారు.జిల్లాలో మహిళలు బాలికలు విద్యార్థినిలు షీటీమ్స్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.

ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube