డా. బాబు జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో నడవాలి : న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి.

రాజన్న సిరిసిల్ల జిల్లా: బాబు జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు.దేశ మాజీ ఉప ప్రధాని ,సమతావాది డా.

 We Should Follow The Babu Jagjivan Ram : Nyalakonda Aruna Raghava Reddy.-TeluguStop.com

జగ్జీవన్ రామ్ 116 వ జయంతి పురస్కరించుకొని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సిరిసిల్ల పట్టణం డా.బి ఆర్ అంబేద్కర్ చౌరస్తా లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.డా.బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికిజిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ , జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్ లు, ఆర్డీఓ , మున్సిపల్ చైర్ పర్సన్ లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.బర్త్ డే కేక్ కట్ చేసి డా బాబు జగ్జీవన్ రామ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ సంఘసంస్కర్తగా, బడుగు బలహీన వర్గాల కోసం బాబు జగ్జీవన్ రామ్ కృషి చేశారని అన్నారు.

జగ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయుడని ఆయన కొనియాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డా.బాబు జ‌గ్జీవ‌న్ రామ్ స్ఫూర్తితో తెలంగాణ లో సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారని చేశారు.ఎస్సీ ల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న ద‌ళిత‌బంధు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుందన్నారు.అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, సంఘ సంస్క‌ర్త‌, భార‌త మాజీ ఉప ప్ర‌ధాని బాబూ జగ్జీవ‌న్ రామ్ జీవితం స్ఫూర్తిదాయ‌కం అని పేర్కొన్నారు.

స్వాతంత్య్ర కు ముందు, ఆ తర్వాత కూడ వివక్ష లేని సమ సమాజం కు కోసం అవిరళ కృషి చేశారని కొనియాడారు.డా.బి ఆర్ అంబేద్కర్ తో కలిసి బాబు జ‌గ్జీవ‌న్ రామ్ అణగారిన వర్గాల రిజర్వేషన్ ల సాధన కోసం కృషి చేసి విజయం సాధించారనీ అన్నారు.

వారి కృషి వల్లే బడుగు, బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాలలో అవకాశాలు చెక్కించుకుంటున్నారని అన్నారు.

డా.బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులవుతూ దేశాన్ని సూపర్ పవర్ గా నిలవాలని కోరారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ మాట్లాడుతూ…డా బాబు జగ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధాని గా, అనేక శాఖల కు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిoచి దేశ పురోభివృద్ధికి పునాదులు వేశారని అన్నారు.అలాగే జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ…డా బాబు జగ్జీవన్ రామ్ కులరహిత సమాజం కోసం, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంత గానో కృషి చేశారని కొనియా డారు.

వారి పుట్టిన రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలోరాష్ట్ర పవర్ లూమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య, డీఆర్ఓ టి.శ్రీనివాస రావు,మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య,జిల్లా బీసీ, ఎస్సీ అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం , జిల్లా సంక్షేమ అధికారి రాజారాం, మైనారిటీ సంక్షేమ శాఖ ఓఎస్డి సర్వర్ మియా, తహశీల్దార్ విజయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ లు, ఎస్సీ సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube