గుడి చెరువు పనులు వేగంగా పూర్తి చేయాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి గుడి చెరువు అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.గుడి చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ చెరువులో టూరిజం శాఖ ఆధ్వర్యంలో బండ్ పార్క్ లో కొనసాగుతున్న నిర్మాణాలను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి మంగళవారం పరిశీలించారు.

 Temple Pond Work Should Be Completed Fast - Collector Anurag Jayanthi, Temple Po-TeluguStop.com

ఈ సందర్భంగా పార్క్, ఇతర నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో  తనిఖీ చేశారు. పనులు, సుందరంగా, ఆకర్షణీయంగా సంప్రదాయ బద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.పిల్లల ఆట స్థలాలు, వాకింగ్ ఏరియా, ఓపెన్ జిమ్  తదితర పనులన్నీ రానున్న జూన్ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు.గుత్తేదారు పనులు సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని, లేదంటే కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ పెట్టాల్సి ఉంటుందని అధికారులను ఆదేశించారు.

సూర్య నమస్కారాలు, ఇతర విగ్రహాలకు పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయని, రంజాన్ , వరుస సెలవుల కారణంగా పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం అక్కడి నుంచి గుడి చెరువు ఆవరణలో కొనసాగుతున్న శివార్చన స్టేజ్ నిర్మాణ పనులను పరిశీలించారు.

పనుల్లో వేగం పెంచాలని ఆలయ ఈఈకి కలెక్టర్ సూచనలు చేశారు.అనంతరం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో వేములవాడ మున్సిపల్ ఆద్వర్యంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పార్క్ ను కలెక్టర్ పరిశీలించారు.పార్క్ లో పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, అలాగే మొక్కలు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టమ్, బెంచీలు, వివిధ రకాల ఆర్ట్స్ వేయనున్నారు.

ఈ పనులు వచ్చే నెల వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

చెరువులు ఆక్రమణకు గురికావద్దు వేములవాడ పరిధిలోని చెరువులను గుర్తించి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, వాటికి హద్దులు పెట్టాలని రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, టూరిజం డీఈ విద్యాసాగర్, జేఈ జీవన్ రెడ్డి, అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డీటీసీపీఓ అన్సారీ, ఆలయ ఈఈ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube