రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ సాయి బాబా కమాన్ కు ఎదురుగా సుసాన డిల్లీ బజార్ పైన మొదటి అంతస్తులో అడ్వకేట్ కుంట శ్రీనివాస్ కార్యాలయాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కోడి లక్ష్మన్ రిబ్బన్ కట్ చేసి మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోడి లక్ష్మన్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, డాక్టర్ అందె కృష్ణ మాట్లాడుతూ అడ్వకేట్ కుంట శ్రీనివాస్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు చేశారని దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.
కేసుల విషయంలో మీరు న్యాయసలహాపొందాలని వారు కోరారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మణ్ మాదిగ, వార్డు సభ్యులు పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ , అడ్వకేట్స్ మహేందర్ , శ్రీ నివాస్, శ్రీ కాంత్ , బాషా , కాంగ్రెస్ పార్టీ నాయకులు సూడిద రాజేందర్ , ఆల్మాస్ పూర్ పందిర్ల శ్రీనివాస్ గౌడ్, మద్దుల తిరుపతి రెడ్డి , తాటిపెల్లి నర్సయ్య , నేరేళ్ళ శ్రీ నివాస్ ,అంశాన్న తదితరులు పాల్గొన్నారు
.