రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా యువమోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ సి) ఎదుట యువ మోర్చా నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.భారతీయ యువ మోర్చా మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ హాస్టల్లో , గురుకులాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం , ఫ్యాకల్టీ చేస్తున్న నిర్లక్ష్యాల వల్ల విద్యార్థులకు కనీస వసతులు లేక ఇబ్బందులకు గురైతున్నారని సరైన భోజనం అందించక విద్యార్థులు ఆస్వస్థకు లోనై సరైన టాయిలెట్స్ లేక వైరల్ జ్వరాలతో బాధ పడ్తున్నారు తరుచుగా హాస్పిటల్ బారిన పడ్తున్నారు ఇవన్నీ ఫాకల్టీ కి తెలిసిన ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు గుట్టు చప్పుడు కాకుండా లోలోపల విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు ఫాకల్టీ చేస్తున్న నిర్లక్ష వైఖరికి ఏ ఒక విద్యార్ధికి ఏమి జరిగిన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని యువమోర్చ ఎల్లారెడ్డిపెట మండల శాఖ ద్వారా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము, ఈ విషయం వెంటనే జిల్లా విద్యాధికారి వెంటనే స్పందించి ఫాకల్టీ పైన తగు చర్యలు తీసుకోవాలి లేని యెడల జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మార్పు దయాకర్ రెడ్డి ఉపాధ్యక్షులు మానుక బాలకిషన్ యాదవ్ సోషల్ మీడియా కన్వీనర్ నరేందర్ నాయకులు ఓరుగంటి చందు , మహేష్ , రోహిత్ , నరేందర్ , సంపత్ , సంతోష్ , ప్రశాంత్ , శ్రీనివాస్ , లక్ష్మణ్ , ప్రభాస్ , అక్షయ్ తదితరులు పాల్గొన్నారు
.