వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది విశ్రాంతి గది ప్రారంభించిన ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) పోలీస్ శాఖలో పని చేస్తున్న పోలీస్ అధికారుల,సిబ్బంది యెక్క సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుదని, వేములవాడ( Vemulawada ) రూరల్ స్టేషన్ సందర్శన సమయంలో సిబ్బంది తమకు విశ్రాంతి గదులు లేక ఇబ్బంది పడుతున్నామని తమ దృష్టి తీసుకవచ్చిన నేపధ్యంలో పోలీస్ స్టేషన్ లో విశ్రాంతి గదులను నిర్మించి పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి ఈ రోజు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… 24/7 విధులు నిర్వహించే సిబ్బందికి విశ్రాంతి ఎంతో అవసరం అని దానికి అనుగుణంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కి విశ్రాంతి గదులు నిర్మించడం జరిగిందన్నారు.

 The Sp Started The Staff Rest Room In Vemulawada Rural Police Station , Rajanna-TeluguStop.com

జిల్లాలో పని చేస్తున్న సిబ్బంది యెక్క సంక్షేమం విషయంలో జిల్లా పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని,వారికి అవసరమైనా అన్ని రకాల సౌకర్యాల కల్పనకు చర్యలు తిసుకోవడం జరుగుతుందన్నారు.పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం,సంక్షేమాం విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సిబ్బంది మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజల మన్నాలు పొందాలన్నారు.

సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకరవలన్నారు.

అదేవిధంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ కి టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ప్రవేశం ఉండేదని దానివలన రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రజలు టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇబ్బంది పడేవారని అందువలన రూరల్ పోలీస్ స్టేషన్ కి మెయిన్ గెట్ (ముఖ ద్వారం ) ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ( SP Akhil Mahajan ) చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా ఎస్పీ తీసుకుంటున్న చర్యలు పట్ల హర్షం వ్యక్తం చేసిన సిబ్బంది.ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచరి, సి.ఐ కృష్ణకుమార్,ఎస్.ఐ మారుతి, సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube