ఉద్యోగాలు అందరూ చేస్తారు… కాకపోతే సేవనే ఉద్యోగంగా మార్చుకుని డబ్బులు సంపాదిస్తూ… అందరికి మంచి చేయాలనుకునే వారు కొందరే ఉంటారు.వాస్తవంగా అలంటి వారు అరుదుగా ఉంటారు.
అలాంటి వెరైటీ వ్యక్తుల్లో నేను మొదటి స్థానంలో ఉన్నాను అంటూ చెప్పుకొస్తోంది ఓ అమెరికా భామ.ఇంతకీ ఆమె ఉద్యోగం ఏంటి అనుకున్నారు.? కౌగిలించుకోవడం ! అవును మీరు విన్నది నిజమే… ఆమె చేసే ఉద్యోగం అదే.ఇంతకీ ఆమె తాను చేసే ఉద్యోగం గురించి ఏం చెబుతుంది అంటే…? బాధ లేదా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నపుడు ఎవరినైనా గట్టిగా హత్తుకుని మనసు భారాన్ని దించేసుకోవాలనే ఫీలింగ్ చాలామందిలో కలుగుతోంది.అయితే, అది అందరికీ సాధ్యం కాదు.దీంతో కొందరు ఒంటరిగానే కుంగిపోతారు.అలాంటి వ్యక్తులు నన్ను గట్టిగా కొగిలించుకోవచ్చు అంటూ చెబుతోంది రాబిన్ స్టినె.
అమెరికాలోని కన్సార్‌కు చెందిన రాబిన్ స్టినె కౌగిలించుకోడాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంది.అబ్బాయిలు, అమ్మాయిలనే తేడా లేకుండా ఎవరైనా సరే ఆమెను హత్తుకుని హాయిగా నిద్రపోవచ్చు.కేవలం కౌగిలింతలే కాదు, ఆమె తన శరీరమంతటినీ కస్టమర్లకు అప్పగిస్తానని రాబిన్ స్టినె తెలిపింది.
చేతుల్లో చేతులు పెట్టవచ్చని, తన శరీరాన్ని నిమరుతూ రిలాక్స్ కావచ్చని పేర్కొంది.తాను కూడా వారి శరీరాన్ని సున్నితంగా నిమురుతూ వారి ఒత్తిడి దూరం చేసేందుకు సహకరిస్తానని తెలిపింది.
ఇది కేవలం థెరపీ మాత్రమేనని, సెక్స్‌కు ఆస్కారం లేదని ఆమె చెప్పుకొచ్చింది.
‘‘మనం ఎవరినైనా అప్యాయంగా కౌగిలించుకున్నప్పుడు.వారి శరీరం రిలాక్స్ అవుతుంది.సంతోషాన్ని కలిగించే ఆక్సిటోసిన్ విడుదలవుతుంది.
ఈ ‘బాండింగ్ హార్మోన్’ ప్రభావం వల్ల ఒత్తిడి కూడా దూరమవుతుంది.చాలామంది తమకు ఏం కావాలని నోరు తెరిచి అడగలేరు.
నేను ఎంచుకున్న ఈ వృత్తి అలాంటివారికి బాసటగా ఉంటుంది.నేను కూడా ఒకప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొనే దాన్ని.
ఆ బాధ నుంచే ఈ ఐడియా పుట్టింది’’ అని రాబిన్ తెలిపింది.అయితే ఇదంతా ఫ్రీగా అనుకున్నారా కాదు కాదు ఇలా చెయ్యాలంటే… గంటకు రూ.5630 చెల్లించాలి.ఇలా ఆమె ఏడాదికి రూ.28 లక్షలు వరకు సంపాదిస్తోంది.ఏంటో ఈ అమెరికన్లు ఏది చేసినా వెరైటీగానే ఉంటుంది.