ఏపీలో హోరాహోరీగా జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు తగిన విధంగా కసరత్తు మొదలుపెట్టాయి.దీనిలో భాగంగానే ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నాయి.ఇక ఈ విషయంలో టీడీపీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.అందుకే…మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి పెట్టింది.అత్యంత కీలకమైన మేనిఫెస్టో రూపొందించేందుకు టీడీపీ సీనియర్ నేతలతో ఓ కమిటీని నియమించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపుగా అనేక కీలక నిర్ణయాల అమలుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.కొత్త అంశాలతో మేనిఫెస్టో ఎలా రూపకల్పన చేస్తారనే అంశంపై అందరిలోనూ … ఆశక్తి నెలకొంది.
అయితే ఎవరూ ఊహించని స్థాయిలో టీడీపీ మేనిఫెస్టో ఉంటుందని టీడీపీ ముఖ్య నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత ఇలా ప్రతివర్గాన్ని ఆకట్టుకునేలా అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని టీడీపీ భావిస్తోంది.