కేంద్రంలో హంగ్ తప్పదా .. ? ఇండియా టుడే సర్వేలో తేలిందిదే

కేంద్ర అధికార పార్టీ బీజేపీ మరోసారి అధికారం దక్కించుకోవాలని కలలు కంటోంది.అయితే.

 Nda Is Not A Majority India Today Sarve Results-TeluguStop.com

ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే … బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ మెజారిటీని కోల్పోతుందని… దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిపితే హంగ్ పార్లమెంట్ వస్తుందని సర్వే తెలిపింది.ఇండియా టుడే-కార్వీ ఇన్ సైట్స్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272కి దగ్గరకు కూడా రాలేదట.మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ప్రకారం ఎన్డీఏ 237 సీట్లు మాత్రమే గెలుస్తుంది.2014తో పోలిస్తే భారీగా 86 సీట్లు కోల్పోతుంది.

అయితే… కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఏ భారీగా పుంజుకోనున్నట్టు మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ అంచనా వేసింది.యుపిఏ కూటమి 166 సీట్లు గెలుచుకోనుంది.2014 ఎన్నికలతో పోలిస్తే యుపిఏ బలం అమాంతంగా 106 సీట్లు పెరగనుంది.ఇక ఎన్డీఏ, యుపిఏ కూటములలో లేని పార్టీలు 140 సీట్లలో నెగ్గుతాయి.

అయితే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ప్రకారం యుపిఏ కంటే ఎన్డీఏ ఓట్ షేర్ అధికంగా ఉంటుంది.కానీ గత ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏ ఓట్ షేర్ తగ్గనుంది.

యుపిఏ ఓట్ షేర్ లో పెరుగుదల ఉంటుంది.ఎన్డీఏకి 35%, యుపిఏకి 33% ఓట్లు లభిస్తాయి.

లోక్ సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిపిన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ఫలితాలు ఖచ్చితంగా … ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఆందోళన కలిగించేవే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube