Herbal tea: ఈ ఒక్క టీ ఎన్ని అద్భుత ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుందో తెలిస్తే తాగ‌కుండా ఉండ‌లేరు!

ఉదయం లేవగానే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది.అసలు టీ తాగకపోతే కొందరు డేను కూడా స్టార్ట్ చేయలేకపోతుంటారు.

 This Herbal Tea Gives A Wonder Health Benefits Details! Herbal Tea, Health Benef-TeluguStop.com

అయితే పాలు, పంచదారతో తయారు చేసే టీలు కంటే హెర్బల్ టీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే టీ కూడా ఒకటి.

ఈ టీని రెగ్యులర్ డైట్ లో కనుక చేర్చుకుంటే ఎన్నో అద్భుత ప్రయోజనాలను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అస‌లు ఆ టీ అందించే ప్ర‌యోజ‌నాలు ఏంటి.? మరియు ఏ సమయంలో ఆ టీని తీసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు, ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులు, రెండు బిర్యానీ ఆకులు వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు బాగా మరిగించాలి.అనంతరం స్టవ్ ఆఫ్ చేసి గ్రీన్ టీ బ్యాగ్‌ను రెండు నిమిషాల పాటు మ‌రిగించిన వాట‌ర్ లో డిప్ చేస్తూ ఉంటే మన హెర్బల్ టీ సిద్ధమవుతుంది.

Telugu Biryani, Benefits, Tips, Healthy Tea, Herbal Tea, Honey, Latest, Pudina-T

ఈ టీ ని ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేసి సేవించాలి.ప్రతిరోజు ఉదయాన్నే ఈ హెర్బల్ టీ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి తదితర జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.అలాగే పైన చెప్పుకున్న హెర్బల్ టీను డైట్ లో చేర్చుకోవడం వల్ల బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య దూరం అవుతుంది.మరియు ఈ టీని తీసుకోవడం వల్ల లోబీపీ సమస్య నుంచి సైతం బయటపడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube