సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ బడ్జెట్ సినిమా యశోద.సమంత మయోసైటీస్ అనే వ్యాధితో పోరాడుతూ కూడా ప్రొమోషన్స్ లో పాల్గొనడం ఈ సినిమాకు కలిసి వచ్చింది.
ఈమె వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారు.దీంతో వీరి నిర్ణయం సాహసం అని అంతా అనుకున్నారు.
ఇక ఎట్టకేలకు డేట్ ఫిక్స్ చేసి అనుకున్న విధంగానే రిలీజ్ కూడా చేసారు.నవంబర్ 11న ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవీ మూవీస్ పతాకంపై పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు.ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.
ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించింది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు మంచి టాక్ అయితే తెచ్చుకుంది.రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మేకర్స్ ఖుషీగా ఉన్నారు.
అయితే సమంత మయోసైటీస్ అనే వ్యాధితో పోరాడుతూ ఉండడంతో చివరి నిముషంలో ఇంటర్వ్యూలలో పాల్గొంది.దీంతో ముందు నుండి ప్రొమోషన్స్ హడావిడి కనిపించలేదు.అయినా కూడా సామ్ ప్రొమోషన్స్ బాగానే ఓపెనింగ్స్ ను రాబట్టాయి.

ఇక వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ లో దూసుకు పోతుంది.ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాదిస్తున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.యూఎస్ లో రోజురోజుకూ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.
రెండు రోజులకే ఈ సినిమా యూఎస్ లో 3 కి పైగా వసూళ్లు రాబట్టింది.టోటల్ గా ఈ సినిమా రెండు రోజుల్లోనే 3 లక్షల 50 వేల డాలర్స్ గ్రాస్ మార్క్ టచ్ చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేసారు.
మరి ఈ స్పీడ్ చూస్తుంటే అతి త్వరలోనే 1 మిలియన్ మార్క్ చేరుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు.







