సినిమా విజయం అత్యంత కీలకం కథ.దాంతో పాటు ఫైట్లు, పాటలు కూడా ఉండాలి.
ఆ పాటలకు తగ్గట్లు డ్యాన్సులు కూడా చేయాలి.అందుకే చాలా మంది హీరోలు డ్యాన్సుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
డ్యాన్సు మాస్టర్లను పెట్టుకుని మరీ డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంటారు.అద్భుత స్టెప్పులతో అదరగొట్టేలా రెడీ అవుతారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో నలుగురు యంగ్ హీరోల మధ్య డ్యాన్స్ విషయం మస్త్ కాంపిటీషన్ ఉంది.ఇంతకీ ఆ నలుగురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లు అర్జున్
టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్సింగ్ హీరో అల్లు అర్జున్.మై లవ్ ఈజ్ గాన్ అంటూ ఆయన వేసిన స్టెప్పులు జనాలను ఓ రేంజిలో ఆకట్టుకున్నాయి.అంతేకాదు.తన సినిమాల్లో అద్భుత డ్యాన్సులతో ఆకట్టుకుంటాయి.ఆయన డ్యాన్సులకు ఫిదా అయ్యారు ఎంతో మంది జనాలు.ఆయన కెరీర్ లో టాప్ డ్యాన్స్ సాంగ్స్ ఇవే.
* టాప్ లేచిపోద్ది
* బుట్ట బొమ్మ
* సిటీమార్
* మై లవ్ ఈజ్ గాన్
* లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో
* సూపర్ మచ్చీ
జూనియర్ ఎన్టీఆర్
క్లాసికల్ డ్యాన్స్ లో దిట్ట జూనియర్ ఎన్టీఆర్.తన తొలి సినిమా నుంచి అద్భుత డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు.
పలు సినిమాల్లో ఆయన వేసిన డ్యాన్సులకు జనాలు అబ్బుర పడ్డారు.ఆయన కెరీర్ లో బెస్ట్ సాంగ్స్ లిస్ట్ ఇదే.

* నాచోరే నాచోరే
* స్వింగు జర స్వింగ్ జర
* పక్కా లోకల్
* నైరే నైరే నైరే బాబా
* శివ శంభో శివ శంభో….
రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి మాదిరిగానే డ్యాన్స్ తో అదరగొట్టడంలో దిట్ట రాం చరణ్.తన తొలి సినిమా చిరుతతోనే తనలోని డ్యాన్స్ టాలెంట్ ను బయట పెట్టాడు.ఆయన కెరీర్ లో బెస్ట్ డ్యాన్స్ సాంగ్స్ ఇవే.

* డిల్లకు ఢిల్లకు
* లైలా ఓ లైలా
* బంగారు కోడి పెట్ట
* జిల్ జిల్ జిల్ జిగేలు రాణి
* ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కే పాస్ ఆజా
రామ్ పోతినేని
మరో యంగ్ హీరో రామ్ కూడా డ్యాన్సులు ఇదరగదీయడంలో దిట్ట.ఆయన తొలి సినిమా దేవదాస్ నుంచే అద్భుతంగా డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.ఈయన కెరీర్ లో బెస్ట్ సాంగ్స్ ఇవే.

*దిమాక్ ఖరాబ్
* క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
* వయలెన్స్ ఈజ్ ఏ ఫ్యాషన్
* డించక్ డించక్